Srikakulam Politics Update: ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ది( duvvada Srinivas ) ప్రత్యేక స్థానం. అలాగని ఆయన పెద్ద స్థాయిలో రాజకీయాలు చేయలేదు కానీ.. రాజకీయంగా వివాదాస్పదం అయ్యారు. వ్యక్తిగత కుటుంబ వివాదాలతో సెలబ్రిటీగా మారిపోయారు. ప్రస్తుతం దివ్వెల మాధురితో కలిసి వకులా శారీస్ పేరిట వస్త్ర వ్యాపారం చేసుకుంటున్నారు. తన వ్యాపారాన్ని తానే ప్రమోట్ చేసుకోవడంతో పాటు మాధురి తో చేస్తున్న రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీ ముచ్చట కొనసాగుతోంది. అయితే కొద్ది రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. అయితే అది ఓ గౌతంరెడ్డిలా.. అనంత్ బాబులా కాకుండా నీ సేవలు ఇక చాలు అని తిప్పి పంపింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. అయితే దీనికి కారణం ధర్మాన, కింజరాపు కుటుంబాలేనని పగ పట్టారు. వారిని మడత పెడతానంటూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
Also Read:
చాలా రోజుల తర్వాత ఎంట్రీ..
అయితే చాలాకాలం తర్వాత శ్రీకాకుళం( Srikakulam) జిల్లాలో అడుగుపెట్టారు దువ్వాడ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయనకు ఏ పార్టీ అండ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలో పట్టించుకునే వారు లేరు. ఇటువంటి తరుణంలో ఓ టిడిపి ఎమ్మెల్యేకు ఆయన అండగా నిలబడడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేజీబీవీ ప్రిన్సిపల్ ఒకామే సంచలన ఆరోపణలు చేశారు. తనను కూన రవికుమార్ మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఇది శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై గట్టిగానే పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ టిడిపి ఎమ్మెల్యే రవికుమార్ కు అండగా నిలబడటం విశేషం.
Also Read:
రవికుమార్ కు అండ..
ఆమదాలవలస నుంచి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం( Sitaram) పై గెలిచారు కూన రవికుమార్. ఆయన మంత్రి పదవిని ఆశించారు. కానీ సమీకరణలో భాగంగా కింజరాపు అచ్చెనాయుడు దక్కించుకున్నారు. అప్పటినుంచి ఆయనతో రవికుమార్ కు విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని సాకుగా తీసుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. రవికుమార్ విషయంలో ధర్మాన కుటుంబంతో పాటు కింజరాపు కుటుంబం హస్తం ఉందని ఆరోపణలు చేశారు. అయితే దీనంతటికీ కారణం ఆ రెండు కుటుంబాలు వెలమ సామాజిక వర్గానికి చెందినవి. రవికుమార్ తో పాటు దువ్వాడ శ్రీనివాస్ కాలింగ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే దీనిని కాళింగ కులం పై దాడిగా మార్చేశారు దువ్వాడ శ్రీనివాస్. తనకు ఉమ్మడి శత్రువుగా ఆ రెండు కుటుంబాలు ఉన్నాయని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోవడంతో తన సామాజిక వర్గం పై దాడి జరుగుతోందని.. దీనిని ఒక కుల పోరుగా మార్చేయాలని దువ్వాడ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మున్ముందు కాళింగులంతా ఏకం కావాలని దువ్వాడ పిలుపునిస్తున్నారు. తద్వారా తన కులం ద్వారానే ఆ రెండు కుటుంబాలకు చెప్పాలని చూస్తున్నారు. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.