Jagan new strategy: ఏపీలో( Andhra Pradesh) కూటమి విచ్ఛిన్నం అవుతుందా? మూడు పార్టీల మధ్య చీలిక రానుందా? జగన్ ఇదే అభిప్రాయంతో ఉన్నారా? పార్టీ శ్రేణులకు ఇదే చెప్పారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే వైసీపీకి కష్టం. పొత్తు విచ్ఛిన్నం అయితే కూటమికి ఇబ్బంది కరం. అయితే ఏపీలో కూటమి విడిపోతుందని జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులతో అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల జరిగిన పరిణామాలను ఉదహరిస్తూ.. త్వరలో కూటమి విచ్ఛిన్నం కావడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇటీవల జరిగిన పరిణామాలు మాత్రం కూటమికి చేటు తెచ్చేలా ఉన్నాయి.
పార్టీ శ్రేణులకు హితబోధ..
ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) మాత్రం అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు, తరువాతి చిరంజీవి చేసిన కామెంట్స్, పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లడం వంటి వాటితో పొత్తు పెటాకులు అవుతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఏకకాలంలో ఈ ఘటనలు జరగడం, దానినే జగన్మోహన్ రెడ్డి గుర్తుకు తెస్తూ పొత్తు విచ్చిన్నం అవుతుందని చెప్పడం వెనుక బలమైన వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా తెర వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్లాన్ వేసినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సొంత కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేలా ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
ఆ ప్రచారంలో నిజం ఎంత?
మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) మృదుస్వభావి. రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నారు. నాకు ఈ రాజకీయాలు వద్దు అంటూ సినిమాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో ఉన్నారు. సినీ పరిశ్రమ లోను కొనసాగుతున్నారు. చిరంజీవితో పోల్చుకుంటే బాలకృష్ణకు దూకుడు ఎక్కువ. అదే సమయంలో రాజకీయాల్లో ఉన్న పదవులు, పైరవీలు కోసం ఆశించే మనిషి కాదు. పార్టీ పట్ల అంకిత భావం ఉంది. అయితే అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. చాలా రకాల నెగిటివ్ ప్రచారం చేసింది. అయితే ఎప్పుడైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారో.. అప్పటినుంచి కొత్త ప్రచారం అందుకుంది. బాలకృష్ణ చేసిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు కలిసారని కొత్త భాష్యం చెబుతోంది.
అదే జరిగితే..
అయితే చిన్న చిన్న పొరపాట్లు అన్నవి సహజం. అవి చంద్రబాబు తో( CM Chandrababu) పాటు పవన్ కళ్యాణ్ కు తెలుసు. ఇప్పటికే వారు ఒక ప్రత్యేక వ్యూహంతో పని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వనని పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. అటువంటిది చంద్రబాబుతో పాటు పవన్ కుటుంబ సభ్యుల ద్వారా.. పొత్తు విచ్చిన్నానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా? ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని.. ఒకవేళ పొత్తు విచ్చిన్నం అయితే.. ఆ మరుక్షణం జరిగే పరిణామాలు అటు చంద్రబాబుకు తెలుసు. ఇటు పవన్ కళ్యాణ్ కు తెలుసు. అందుకే అందులో ఎంత మాత్రం నిజం లేదని కొట్టి పారేస్తున్నాయి కూటమి వర్గాలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.