Vijayawada West: ఏపీలో ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. జనసేన కీలక నేత పోతిన మహేష్ పార్టీని వీడడం, పవన్ పై హాట్ కామెంట్స్ చేయడంతో ఈ నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతము ఇక్కడ వైసిపి అభ్యర్థి ఆసిఫ్, కూటమి అభ్యర్థి సుజనా చౌదరి మధ్య గట్టి ఫైట్ నెలకొంది. ఈ నియోజకవర్గంలో ముస్లింలు అధికం. ఎస్సీ,ఎస్టీలతో పాటు వైశ్యులు కూడా ఉన్నారు. దీంతో ఆయా వర్గాలు ఎటువైపు మొగ్గు చూపుతాయో తెలియాలి.గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలిచారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి బదిలీ కావాల్సి వచ్చింది.
అయితే సుజనా చౌదరి ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడమే సాహసం చెప్పాలి. కృష్ణా జిల్లాకు చెందిన సుజనా చౌదరి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగడం ఇదే తొలిసారి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు సుజనా చౌదరి. స్వతహాగా పారిశ్రామికవేత్త ఆయన టిడిపి తో పాటు చంద్రబాబుకు అండదండగా నిలిచారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సుజనా చౌదరికి సరైన గౌరవం దక్కింది. ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వడంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు. గత ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత సుజనా తో పాటు నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన చంద్రబాబుతో పాటు టిడిపి ప్రయోజనాల కోసం సుజనా చౌదరి తన వంతు ప్రయత్నాలు చేశారని.. అందులో భాగంగానే బిజెపి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పుకుందని ఒక టాక్ ఉంది. అయితే అటువంటి కీలక నేతగా ఉన్న సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సాహసమే.
సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా జగన్ ఇక్కడ ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేశారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వెల్లంపల్లి ని బదిలీ చేసి… ఓ సాధారణ ముస్లిం నాయకుడు అసిఫ్ కు సీటు ఇచ్చారు. ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉండడంతో పాటు ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ కావడంతో ఇక్కడ వైసిపికి ప్లస్ గా మారింది. మొన్నటి వరకు జనసేనలో కీలక నేతగా వ్యవహరించిన పోతిన మహేష్ సైతం ఇప్పుడు పక్కకు తప్పుకున్నారు. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా వైసీపీకి ప్లస్ పాయింటన్న టాక్ నడుస్తోంది. సామాజిక వర్గాలన్నీ కలిసి వస్తాయని జగన్ అంచనా వేశారు.
స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన సుజనా చౌదరి ఎలాగైనా పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు ఈ నియోజకవర్గంలో చాలా తక్కువ. మరోవైపు ఆయన బిజెపి అభ్యర్థి కావడంతో ముస్లింలు టర్న్ కావడం కూడా అంత ఈజీ కాదు. ఆయన కేవలం టిడిపి, జనసేన బలంపై ఆధారపడుతున్నారు. ఆ రెండు పార్టీల మద్దతుతోనే ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమాతో ఉన్నారు. మరోవైపు జనసేన కీలక నేత పోతిన మహేష్ వెళ్ళినా.. ఆయన పవన్ ను టార్గెట్ చేసుకోవడంతో జనసైనికులు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. జనసేనలో కొనసాగి పోతిన మహేష్ కు గట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇది సుజనా చౌదరికి కలిసివచ్చే అంశం. మొత్తానికి అయితే ఏపీలో పశ్చిమ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. అక్కడ ఫలితం పై సర్వత్రా చర్చ నడుస్తోంది.