SIM KYC Scam: సైబర్ క్రైమ్ నేరాలు చాలా పెరిగాయి. ఎవరు ఎలాంటి నేరానికి మోసపోవాల్సి వస్తుందో గుర్తించడం కూడా కష్టమే. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఏ ఫోన్ మీ బ్యాంక్ బాలెన్స్ ను ఖాళీ చేస్తుందో కూడా తెలియదు. జాగ్రత్తగా ఉండటమే మీ కర్తవ్యం. ఎవరు ఫోన్ చేసినా,మెసేజ్ చేసినా సరే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తదుపరి స్టెప్ తీసుకోవాలి అని హెచ్చరిస్తున్నారు అధికారులు. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే నిత్యం ఎన్నో సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి.
మీ బ్యాంక్ అకౌంట్ సస్పెండ్ అయింది. ఈ డాక్యుమెంట్స్ సెండ్ చేయండి. లేదా లింక్ ఓపెన్ చేయండి అంటూ ఫోన్ చేస్తుంటారు. లేదా లోన్ కట్టలేదు. కావాలంటే చెక్ చేసుకోండి ఈ లింక్ ను ఓపెన్ చేయండి అంటూ టెన్షన్ పెడతారు. మీరు కూడా కంగారుతో లింక్ ఓపెన్ చేశారంటే మీ సంగతి అంతే ఇక. లేదంటే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం వారి ఖాతాలోకి వెంటనే వెళ్తాయి. ఇక కోన్ని సార్లు లక్కీ అని, ఆఫర్ అని లింక్ క్లిక్ చేమయని చెబుతుంటారు. లేదా లోన్ ఇస్తామంటూ డాక్యుమెంట్స్ కావాలి అంటూ కాల్ చేస్తారు.
Also Read: AP electricitybill refund: ఇంతకీ ఏంటి ఏపీలో ఈ కరెంట్ చార్జీల కిరికిరి!
ఇప్పుడు మాత్రం కొత్తరకం క్రైమ్ ట్రెండ్ అవుతుంది. దీని గురించి PIB అలర్ట్ జారీ చేసింది. మీ సిమ్ KYC ని ట్రాయ్ సస్పెండ్ చేసింది. 24 గంటల్లో మీ సిమ్ బ్లాక్ అవుతుంది. వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి అంటూ నోటీసులు వస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి అంటూ ఫోన్ నెంబర్ ఇస్తారు. దీనికి కాల్ చేశారో మీ అకౌంట్ లో డబ్బులు ఫట్ మంటాయి. లింక్స్ ఓపెన్ చేసినా సరే మీ డబ్బులకు ఇక నో గ్యారంటీ. ఇలాంటి వాటికి నమ్మి మీ వ్యక్తిగత సమాచారాన్ని పంపించవద్దు అని చెబుంది PIB.
ఇవి పేక్ అని, ఇలాంటివి నమ్మవద్దని, నమ్మి బ్యాంక్ డిటెయిల్స్, పర్సనల్ ఇన్ ఫర్మేషన్ వంటివి ఇవ్వవద్దు అని తెలిపింది PIB. ఎందుకంటే BSNL ఇలాంటి నోటీసులు ఇవ్వదని స్పష్టం చేసింది PIB. జాగ్రత్త. మీ అకౌంట్ లో డబ్బులు ఉంటే మాత్రం కాస్త జాగ్రత్త. ఏ లింక్ అయినా సరే మీరు క్లిక్ చేయకుండా ఉండటమే బెటర్. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ నేరం ఎప్పుడు ఎలా జరుగుతుందో అర్థం అవడం కష్టమే.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.