YCP Party : అధికారంలో ఉన్న ఐదేళ్లు. నోటికి ఎంత వస్తే అంత అన్నట్లు.. నేతల వయసు, పదవి, హోదాతో సంబంధం లేకుండా ఇష్టానుసారం మాట్లాడారు వైసీపీ నేతలు. కానీ, మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. నోటి దురుసు ప్రదర్శించిన నేతలందరినీ ఏపీ ప్రజలు ఓడించారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ సైలెంట్ అయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు కీరోల్ పోషించిన నేతలంతా ఇప్పుడు నోరు మెదపడం లేదు. మరోవైపు అధిష్టానం కూడా నోటి దురుసు నేతలను పక్కన పెడుతోంది. దీంతో అంతా సైలెంట్ అయ్యారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లు మంత్రిగా పనిచేసిన బీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఇప్పుడు గప్‌చుప్ అయ్యారు. ఆయన తన విద్యాసంస్థల వ్యవహారాలు చూసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ, ఆయన ఎక్కడ కనిపించడం లేదు. రాజకీయాలు వ్యాపారాలకు అడ్డుగా మారతాయని, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
= వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ముత్యాలనాయుడు కూడా సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయన కూతురుకు విశాఖ రూరల్ టికెట్ ఇచ్చి.. ముత్యాలనాయుడుకు ఎంపీ టికెట్ ఇచ్చింది. కానీ, ఇద్దరూ ఓడిపోయారు. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు.
= గుడివాడ అమర్నాథ్‌కు వైసీపీ అనేక అవకాశాలు ఇచ్చింది. ఆయనను అనాకాపల్లి నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా, గాజువాక నుంచి ఎమ్మెల్యగా టికెట్ ఇచ్చింది. 2014 నుంచి 2019 వరకు ఆయన విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు మరోమారు ఆ పదవి చేపట్టారు. కానీ యితే గుడివాడ దూకుడు అయితే గతంలో ఉన్నంతగా లేదని అంటున్నారు. ఆయన కూడా స్పీడ్ పెంచాల్సి ఉందని చెబుతున్నారు.
మొత్తంగా వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వారే బాధ్యత తీసుకుని జనంలోకి రాకపోతే పార్టీ క్యాడర్ కోసం నిలబడి ముందుకు నడిపించేది ఎవరు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధినాయకత్వం ఈనెల 13 నుంచి దశలవారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో మరి ఇప్పటికైనా మాజీలు, కీలక నేతలు బయటకు వస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేతలు మళ్లీ పుంజుకుని ఫ్యాన్ స్పీడ్ పెంచాలని అధిష్టానం భావిస్తోంది. కానీ, ఆ దూకుడు నేతల్లో కనిపించడం లేదు.