Homeఆంధ్రప్రదేశ్‌Siddam Sabha: 'గ్రాఫిక్స్'తో సిద్ధం సభలు సక్సెస్

Siddam Sabha: ‘గ్రాఫిక్స్’తో సిద్ధం సభలు సక్సెస్

Siddam Sabha: వైసీపీ సిద్ధం సభలకు లక్షలాదిమంది జనాలు వస్తున్నారా? ఒక సభకు మించి మరో సభకు జన సమీకరణ పెరుగుతోందా? నిన్నటి సిద్ధం సభకు 15 లక్షల మంది జనం వచ్చారా? అందులో నిజం ఎంత? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏపీ సీఎం జగన్ సిద్ధం పేరిట భారీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు ప్రాంతాల్లో ఈ సభలు పూర్తయ్యాయి. తొలుత విశాఖ జిల్లా భీమిలిలో సభ జరిగింది. ప్రకాశం జిల్లా మేదరమెట్ల లో చివరి సిద్ధం సభ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది.అయితే జనాలను చూపించడంలో గ్రాఫిక్స్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై టిడిపి అనుకూల మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తోంది.

సిద్ధం సభలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార పార్టీ కావడంతో భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించింది. వేలాది ఆర్టీసీ సర్వీసులను సైతం వినియోగించుకుంది. దాదాపు 500 కిలోమీటర్ల దూరం నుంచి జనాలను తరలించినట్లు తెలుస్తోంది. సిద్ధం సభలు జరిగే సమయంలో రెండు రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. మరోవైపు ఈ సిద్ధం సభలకు 600 కోట్ల రూపాయలు జగన్ సర్కార్ ఖర్చు చేసిందని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అయితే ఈ విమర్శలను పక్కన పెడితే సభలకు వస్తున్న జనం విషయంలో రకరకాల అనుమానాలు వస్తున్నాయి. దీనిపైనే టిడిపి సోషల్ మీడియా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం విశేషం.

ప్రకాశం జిల్లా మేదరమెట్ల లో నిన్న సిద్ధం సభ ఏర్పాటు చేశారు. అయితే సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లోకి రావద్దని స్థానిక గ్రామస్తులు, యువకులు, ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. దీంతో సభ నిర్వహణపై రకరకాల అనుమానాలు రేకెత్తాయి. మీడియాపై సైతం పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టారు. ఒక్క సాక్షి మీడియాకు మాత్రమే అనుమతించారు. అయితే సభా ప్రాంగణంలో పూర్తిగా గ్రీన్ మ్యాట్లు పరిచారు. లైవ్ స్ట్రీమింగ్ లో కూడా చాలా తేడా కనిపిస్తోంది. దీంతో గ్రాఫిక్స్ ద్వారా జనాలు భారీగా వచ్చినట్లు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. అటు టిడిపి అనుకూల మీడియా సైతం ఇదే విషయాన్ని హైప్ చేస్తుండడం విశేషం. వి ఎఫ్ఎక్స్ ని ఉపయోగించి గ్రాఫిక్ చేశారని టిడిపి ఆరోపిస్తోంది. అటు ప్రత్యక్ష ప్రసారం సైతం 40 నిమిషాలు ఆలస్యం గా కనిపిస్తోంది. లైవ్ ఫుటేజ్ ని ప్రదర్శించడానికి విలేకరులకు అనుమతించకపోవడం కూడా అనుమానాలకు బలం చేకూరుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular