Sharmila Comments Chandrababu: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు టిడిపి కూటమి సర్కార్ పై దృష్టిపెట్టారు. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తాజాగా అమరావతి రాజధానికి వెళ్లి మరి చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అమరావతిలో ప్రధాని మోదీ తొలిసారి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నిరసన చేపట్టారు షర్మిల. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానికి అదనపు భూముల సేకరణ గురించి కూడా ప్రస్తావించారు. తక్షణం దానిని నిలిపి వేయాలని అల్టిమేట్ జారీ చేశారు. ప్రస్తుతం షర్మిల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: అదానీకి ఏపీలో మూడినట్టే.. లొల్లి మొదలైందిగా
అంతర్జాతీయ విమానాశ్రయం కోసం
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం తో పాటు మరికొన్ని నిర్మాణాలకు గాను అదనపు భూ సేకరణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మొన్న ఆ మధ్యన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కూడా. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో టిడిపి ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో షర్మిల అమరావతి ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు మళ్ళీ భూ సేకరణ చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కి అంతర్జాతీయ విమానాలు రావడం లేదని.. మళ్లీ అమరావతిలో ఏర్పోర్ట్ అవసరమా అంటూ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. 2015 లోనే రాజధానికి శంకుస్థాపన చేసిన మోడీ ఏమి ఇచ్చారు అని ప్రశ్నించారు. మళ్లీ ఇప్పుడు రెండోసారి వచ్చి సేమ్ సీన్ రిపీట్ చేశారని ఎద్దేవా చేశారు. మోడీ మాటలు నమ్మి చంద్రబాబు గోతిలో పడ్డారని ఆక్షేపించారు.
Also Read: తన డ్రైవర్ ను జనసేన లేడీ ఇన్ చార్జి ఎందుకు అంత క్రూరంగా అంతం చేసింది? ఏంటా కథ?
అంత భూమి ఎందుకు?
మరోవైపు 2015లో 33 వేల ఎకరాల భూములు సేకరించారని.. ఆ లెక్కన మరో 20,000 ఎకరాల భూమి ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. 54 వేల ఎకరాల్లో రాజధాని కడతాం అన్నారని.. సింగపూర్ జపాన్ చేస్తామని చెప్పారని.. రాజధాని బెస్ట్ లేవాబుల్ సిటీ అన్నారని గుర్తు చేశారు షర్మిల. ఇప్పుడు అదనపు భూ సేకరణ పేరిట డ్రామాలు ఆడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వాస్తవానికి రాజధాని నిర్మాణం అనేది కేంద్రం బాధ్యత కాదా అంటూ నిలదీశారు. విభజన హామీల్లోనే కాంగ్రెస్ స్పష్టంగా దీనిని చెప్పిందని.. కానీ మీరు చేస్తుంది ఏమిటని ప్రశ్నించారు షర్మిల. అమరావతి పేరుతో అప్పులు చేస్తున్నారని.. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే అంటూ షర్మిల డిమాండ్ చేశారు. అయితే ఇప్పటివరకు షర్మిల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు యూటర్న్ తీసుకొని చంద్రబాబుపై విమర్శలు చేయడం విశేషం.
PCC President Sharmila Reddy’s Clear Stand!
Chandrababu and Modi together promised to take farmers’ lands in Amaravati and build the capital within two years, giving houses and commercial plots in return. But even after ten years, justice has not been done.
Now, once again, they… pic.twitter.com/YiZ1SYFTo2— Shaik Mastan Vali (@MastanValiINC) July 11, 2025