Homeఆంధ్రప్రదేశ్‌Sajjala Bhargav Reddy : సజ్జల భార్గవ్ రెడ్డిపై ‘‘వర్రా’’ రిమాండ్ రిపోర్టులో సంచలన...

Sajjala Bhargav Reddy : సజ్జల భార్గవ్ రెడ్డిపై ‘‘వర్రా’’ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Sajjala Bhargav Reddy : ఏపీవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడే వారిని అరెస్టు కూడా చేశారు. ఈ క్రమంలోనే వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.ఈయన వైసీపీ కీలక నేత కుటుంబానికి సహాయకుడు కూడా. వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతుంటారు. గత ఐదేళ్లుగా ఇదే మాదిరిగా వ్యవహరించారు. కానీ అధికారం అండదండలతో ఆయనపై ఎటువంటి చర్యలు లేవు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వర్ర రవీందర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయేవారు.అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం,ఆవేదనతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది.రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తునకేసులు నమోదు కావడం ప్రారంభం అయ్యాయి. అయితే 41 ఏ నోటీసులు ఇచ్చి వర్ర రవీందర్ రెడ్డిని వదిలేసారు కడప పోలీసులు. దీనిపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయ్యింది.అందుకు కడప జిల్లా ఎస్పీ మూల్యం చెల్లించుకున్నారు.ఆయనపై బదిలీ వేటు పడింది. ఈ నేపథ్యంలో వర్రా రవీందర్ రెడ్డి ఆచూకీ కోసం నాలుగు పోలీసు బృందాలు విచారణను ప్రారంభించాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్ లో రవీందర్ రెడ్డి పట్టుబడ్డారు. ఈ తరుణంలో ఆయనను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు.తన వెనుక ఉన్నది కడప ఎంపీ అవినాష్ రెడ్డి అంటూ ఆయన సంచలన విషయాలు బయట పెట్టారు. మరోవైపు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు జీతాలు అందినట్లు కూడా వెల్లడించారు. ఇది ఒక సంచలన అంశంగా మారిపోయింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు బుర్ర రవీందర్ రెడ్డి.

* గత ఐదేళ్లుగా కీచక పర్వం
గత ఐదేళ్లుగా సోషల్ మీడియా ఇన్చార్జిగా సజ్జల భార్గవరెడ్డి వ్యవహరించారు. ఆయన నేతృత్వంలోని వందలాదిమంది వైసీపీ సోషల్ మీడియాకు సేవలందించారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగేవి. అయితే అవన్నీ సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలోని సోషల్ మీడియా వింగ్ ఆదేశాలు అనుసారమే జరిగేవి. అయితే ఈ విషయాలన్నీ వర్ర రవీందర్ రెడ్డి పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సజ్జల భార్గవ్ రెడ్డి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగించినట్లు సమాచారం. భార్గవ్ రెడ్డి దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్లిపోతారన్న ప్రచారం నేపథ్యంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే భార్గవ రెడ్డి పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఓ వ్యక్తి భార్గవ్ రెడ్డి పై నేరుగా ఫిర్యాదు చేశారు. జగన్ పై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో తనను కులం పేరుతో దూషించారని పులివెందుల నియోజకవర్గానికి చెందిన హరి అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో భార్గవరెడ్డి తో పాటు వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డి లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంతో భార్గవ రెడ్డి ఎక్కడ విదేశాలకు వెళ్లిపోతారని భావించి పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

* సజ్జల ఎంట్రీ తోనే అరాచకం
అయితే సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే పరిస్థితి మారిందని రవీందర్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని అతడే బెదిరించాడని గుర్తు చేశారట. వైసిపి సోషల్ మీడియా ఇన్చార్జిగా భార్గవరెడ్డితోపాటు అర్జున్ రెడ్డి, సుమారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు రవీందర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించారు. అయితే కూటమి గెలిచిన తర్వాత భార్గవరెడ్డి అదృశ్యమయ్యారు. ఎట్టకేలకు రవీందర్ రెడ్డి పట్టు పడడంతో భార్గవ రెడ్డి పాత్ర బయటపడింది. దీంతో భార్గవరెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఆయన విదేశాలకు పారిపోకుండా చూసేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తానికైతే సజ్జల భార్గవరెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular