
Mahesh-Rajamouli Movie: రాజమౌళి సినిమా సినిమాకు ఓ మెట్టు ఎదుగుతున్నారు. బాహుబలి చిత్రాలతో బాక్సాఫీస్ షేక్ చేసిన ఆయన ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయన రేంజ్ ప్రపంచ స్థాయికి చేరింది. ఏకంగా గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డుల అందుకునే స్థాయికి వెళ్లారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక ఆస్కార్ నామినేషన్స్ పొందిన నాటు నాటు అవార్డు కైవసం చేసుకుంటుందని మేకర్స్, ఇండియన్ ఆడియన్స్ కృతనిశ్చయంతో ఉన్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ అయ్యారు. ముఖ్యంగా రామ్ చరణ్ అరుదైన గౌరవాలు అందుకుంటున్నారు.
ప్రస్తుతం రాజమౌళి అమెరికాలోనే ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రం హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు గెలుచుకుంది. ఈ అంతర్జాతీయ సినిమా వేడుకలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ సందడి చేశారు. మరో రెండు వారాల్లో జరగనున్న ఆస్కార్ ఈవెంట్లో సైతం పాల్గొననున్నారు. ఆస్కార్ ఈవెంట్ అనంతరం రాజమౌళి ఇండియాకు రానున్నారు. మరోవైపు మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి తన నెక్స్ట్ మూవీ మహేష్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జరిగింది.
కాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ డిటైల్స్ బయటకు వచ్చాయి. రాజమౌళి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో మహేష్ మూవీ ఉండనుందట. ఈ సినిమాకు రాజమౌళి అనుకుంటున్న బడ్జెట్ రూ. 1000 కోట్లు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించనున్నారట. ఉత్తమ సాంకేతిక నిపుణులతో పని చేయబోతున్నారట. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ కోసం భారీగా ఖర్చు చేయనున్నారట. ప్రేక్షకులకు మరో భారీ విజువల్ వండర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… ఈ మూవీలో బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అమీర్ ఖాన్ కీలక రోల్ చేస్తున్నారు. అందుకు ఆయనకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారట. రాజమౌళి ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరిపారట. రాజమౌళి మూవీ అనగానే ఆయన ఓకే చేశారని సమాచారం. ఇక ఇది యాక్షన్ అడ్వెంచరస్ మూవీ అని ఆల్రెడీ వెల్లడించారు. హీరోయిన్ గా కూడా దీపికా పదుకొనె వంటి టాప్ హీరోయిన్స్ పేర్లు పరిగణలో ఉన్నాయి. కాబట్టి మహేష్ మూవీతో రాజమౌళి తన రికార్డుల వేట కొనసాగించనున్నారు.