AP Politics: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచల నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీలు ఇచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
వేటు పడింది వీరిపైనే..
స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యేలు వైసీసీ నుంచి గెలిచిన ఆనం రామనారాయాణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ కోరింది. ఇక టీడీపీకి చెందిన మద్దాల గిరి, కరణం బలరామ్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌పై అనర్హత వేటు వేయాలని టీడీపీ స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చింది. దీని ఆధారంగా నలుగురిపై కూడా వేటు వేశారు.
వేటు పడినా పోటీ చేసే ఛాన్స్..
ఇక రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా.. సాధారణ ఎన్నికల్లో వారు పోటీ చేసే అంశంపై ఎలాంటి ప్రభావం ఉండదని పరిశీలకులు చెబుతున్నారు. ఏదైనా క్రిమినల్ కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడితే ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కేవలం పదవులు మాత్రమే కోల్పోతారు. ఎన్నికల సమయం దగ్గర పడిన వేళ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడం ద్వారా చాలా ఆలస్యం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు నెలల పదవి కాలం ఉండగా అనర్హత వేటు వేయడం వలన వీరికి ఎలాంటి నష్టం జరుగదు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Sensational decision of ap speaker disqualification of 8 mlas
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com