Homeఆంధ్రప్రదేశ్‌Seaplanes : ఏపీలో నీటి విమానాలు.. ఏయే ప్రాంతాల్లో అంటే?

Seaplanes : ఏపీలో నీటి విమానాలు.. ఏయే ప్రాంతాల్లో అంటే?

Seaplanes : ఏపీ ప్రభుత్వం( AP government ) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా తీరప్రాంతాల్లో నీటి విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చే క్రమంలో ఈ నీటి విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. తద్వారా పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఈ సిప్లేన్ల ఏర్పాటు.. అందుకు అనుగుణంగా నీటి విమానాశ్రయాల ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో ఇప్పటికే నీటి విమానాశ్రయ ఏర్పాటుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర 20 కోట్ల రూపాయలతో వాటర్ ఏరో డ్రోమ్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. ఇటీవల కేంద్రం నుంచి వచ్చిన అధికారులు స్థల పరిశీలన కూడా పూర్తి చేశారు.

Also Read : ఏపీలో ‘అవిశ్వాసాల’ ఫీవర్.. నెల రోజుల్లో అధికార మార్పిడి!

* కొద్ది రోజుల కిందట
గత ఏడాది నవంబర్లో విజయవాడలోని( Vijayawada ) కృష్ణానది పున్నమి ఘాట్( Ghat ) నుంచి శ్రీశైలానికి వెళ్లే సి ప్లేన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అదే సి ప్లేన్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి శ్రీశైలం కూడా వెళ్లారు. సి ప్లేన్ సర్వీసులను సాధారణ విమాన చార్జీల స్థాయికి అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా పర్యాటకశాఖ సమీక్షలు చంద్రబాబు కీలక సూచనలు చేశారు సంబంధిత అధికారులకు. స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

* అన్ని ప్రాంతాల్లో సీప్లేన్లు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో సిప్లేన్లను( sea planes ) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్, గండికోట, కోనసీమ, కాకినాడ, అరకు వ్యాలీ, లంబసింగి, రుషికొండ, తిరుపతి వంటి పర్యాటక ప్రాంతాలను కలుపుతూ సీప్లేన్ల అభివృద్ధి చేయాలని సూచించారు చంద్రబాబు. అయితే ఇప్పటికే విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి సిప్లేన్ల ఏర్పాటు జరిగింది. మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

* పర్యాటక రంగానికి శోభ..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. గత ఐదు సంవత్సరాల్లో పర్యాటక రంగం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదు. నిధుల కేటాయింపు కూడా లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక శాఖ పురోగతి సాధిస్తూ వస్తోంది. రకరకాల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా సిప్లేన్లు, నీటి విమానాశ్రయాల ఏర్పాటు జరుగుతుండడం శుభపరిణామం.

Also Read : డి లిమిటేషన్ తో ఏపీలో పెరిగే నియోజకవర్గాలు ఎన్నో తెలుసా?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular