Mom And Pop Business Owners Day: వ్యాపారం అనేది చిన్నదైనా కూడా లాభమే. డబ్బులు ఉన్నవారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తుంటారు. డబ్బులు లేని వారు కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్న వ్యాపారాలు చేస్తుంటారు. ఎవరికి ఎంత డబ్బు దాని బట్టి పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తారు. అయితే మనం డైలీ ఎందరో చిన్న వ్యాపారులను చూస్తుంటాం. ఎందరో కూడా కుటుంబం కోసం చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మన ఇంట్లోకి ఒక పాల పాకెట్ కావాలన్నా కూడా ఇంటి పక్కన ఉన్న ఓ షాపుకి వెళ్తాం. ఆర్థిక సమస్యల కారణంగా ఎవరో ఒకరు వీధిలో ఇలా చిన్న షాపులు పెడుతుంటారు. ఇలా చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసం ప్రతీ ఏడాది మార్చి 29వ తేదీన నేషనల్ మామ్ అండ్ పాప్ బిజినెస్ ఓనర్స్ డే (National Mom and Pop Business Owners Day) జరుపుకుంటారు. చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపే వారి కృషిని గుర్తించేందుకు నేషనల్ మామ్ అండ్ పాప్ బిజినెస్ ఓనర్స్ డే నిర్వహిస్తారు. అయితే ఈ నేషనల్ మామ్ అండ్ పాప్ బిజినెస్ ఓనర్స్ డే ఎలా వచ్చింది? ఎవరు ఈ డేని జరుపుకోవాలని ప్రయత్నించారనే? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
నేషనల్ మామ్ అండ్ పాప్ బిజినెస్ ఓనర్స్ డే జరుపుకోవడానికి ముఖ్య కారణం రిక్, మార్గీ సెగెల్ అనే దంపతులు. వీరు తల్లిదండ్రులు వ్యాపారాలు చేసేవారు. వారి వ్యాపారాలకు గౌరవంగా ఈ నేషనల్ మామ్ అండ్ పాప్ బిజినెస్ ఓనర్స్ డేని ప్రారంభించారు. వీరి తల్లిదండ్రులు1939లో ఒక టోపీల దుకాణం స్టార్ట్ చేశారు. చిన్నగా వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాత పెద్దగా అభివృద్ధి చెందారు. మొత్తం 10,000 చదరపు అడుగుల్లో పెద్ద దుకాణంగా మార్చారు. దీనికి గుర్తుగా వీరు ఈ నేషనల్ మామ్ అండ్ పాప్ బిజినెస్ ఓనర్స్ డేను నిర్వహించారు. ఈ దినోత్సవం ప్రత్యేకత ఏంటంటే.. చిన్న వ్యాపారం చేసుకునే వారిని ప్రోత్సహించడం, వారి వ్యాపారానికి కాస్త మద్దతుగా ఉండేందుకు దీన్ని జరుపుకుంటారు. కుటుంబంలో కూడా తల్లులు, స్నేహితులు ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు. వారందరికి గుర్తింపును ఇచ్చేందుకు ప్రతీ ఏడాది మార్చి 29వ తేదీన ఈ నేషనల్ మామ్ అండ్ పాప్ బిజినెస్ ఓనర్స్ డే జరుపుకుంటారు. దేశ వ్యా్ప్తంగా చూసుకుంటే ఎన్నో చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఉన్నారు. పూల షాపు, పాల కొట్టు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వారందరికీ కూడా కస్టమర్లు మెరుగైన సేవలు అందించాలని, వారి వ్యాపారాలకు ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవం రోజు చిన్న వ్యాపారులను సపోర్ట్ చేయండి. మీకు అక్కడ లభ్యమైన వాటిని కొనుగోలు చేయండి. అలాగే సోషల్ మీడియాలో #MomPopBusinessOwnersDay హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల చిన్న వ్యాపారులను ప్రోత్సహించినట్లు అవుతుంది.