Sand Dispute : ఇసుక ఉచితం.. కానీ మీ ఇంటికి తెచ్చి పోస్తా అని చేప్పలేదుగా.. ట్విస్ట్ ఇచ్చిన బాబు

ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా..ఒక్కో పథకాన్ని ప్రకటిస్తూ వచ్చింది.అందులో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించింది.అయితే రవాణా చార్జీలు నిర్మాణదారులే చెల్లించాల్సి ఉంటుంది. అదే విషయాన్ని ఇప్పుడు ఉచిత ఇసుక విధానంలో పొందుపరిచారు. ట్రాన్స్పోర్ట్ చార్జీలు ప్రకటించారు.దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఉచిత ఇసుక విధానం అంటే ఇదా?అని ప్రశ్నించడం ప్రారంభించారు.జగన్ చేసింది..మీరు చేస్తున్నారు కదా అని నెటిజన్లు నిలదీశారు

Written By: Dharma, Updated On : July 9, 2024 8:22 pm

Sand Dispute Chandrababu

Follow us on

Sand Dispute : ఏపీలో ఉచితంగా ఇసుక ఇస్తామని చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. నిన్ననే ఆర్భాటంగా రాష్ట్రవ్యాప్తంగా ఇసుక పంపిణీ ప్రారంభించింది.గత ప్రభుత్వంలో ఇసుక విధానం అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనినే ఎన్నికల ప్రచారంలో హైలెట్ చేశారు చంద్రబాబు. జగన్ పేదల పొట్టను కొట్టారని.. ఇసుకను ఖరీదైన వస్తువుగా మార్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించారు. అయితే స్టాక్ పాయింట్ నుంచి ఇంటి వరకు రవాణా చార్జీలు వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.ఇప్పుడు అదే విషయాన్ని చంద్రబాబు సర్కార్ ప్రకటించడంతో.. విపక్షాలు ఎద్దేవా చేయడం ప్రారంభించాయి. ఇదే నా ఉచిత ఇసుక విధానం అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టాయి.

గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానాన్ని మార్చారు అప్పటి పాలకులు. ఈ నేపథ్యంలో రకరకాల విమర్శలు చుట్టుముట్టాయి. ఇసుక అందక భవన నిర్మాణం నిలిచిపోయింది. వేలాదిమందికి ఉపాధి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. జగన్ సర్కార్ కు ఒకరకంగా ఇది మైనస్ గా మారింది. విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారింది. ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఇసుక విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైఫల్యాలను ఎండగట్టారు. టిడిపి అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందిస్తామని.. రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలకు కూడా ఈ ప్రకటనను బలంగా నమ్మారు. ఏకపక్షంగా మద్దతు తెలిపారు.

ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా..ఒక్కో పథకాన్ని ప్రకటిస్తూ వచ్చింది.అందులో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించింది.అయితే రవాణా చార్జీలు నిర్మాణదారులే చెల్లించాల్సి ఉంటుంది. అదే విషయాన్ని ఇప్పుడు ఉచిత ఇసుక విధానంలో పొందుపరిచారు. ట్రాన్స్పోర్ట్ చార్జీలు ప్రకటించారు.దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఉచిత ఇసుక విధానం అంటే ఇదా?అని ప్రశ్నించడం ప్రారంభించారు.జగన్ చేసింది..మీరు చేస్తున్నారు కదా అని నెటిజన్లు నిలదీశారు. గత రెండు రోజులుగా వైరల్ అంశం గా మారడంతో చంద్రబాబు స్పందించారు. విద్యుత్ విధానాలపై శ్వేత పత్రం విడుదల చేసే క్రమంలో ఇసుక పాలసీ ప్రస్తావన వచ్చింది.దీనిపై స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు చంద్రబాబు.ఉచిత ఇసుక విధానం అంటే.. ఇంటింటికి ఇసుక తెచ్చి పోస్తా అని చెప్పడం కాదని స్ట్రాంగ్ గా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజెన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.