Sana Satish: ఆంధ్ర క్రికెట్ నుంచి హనుమ విహారి తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించాడు. దీంతో వైసిపి రంగంలోకి దిగింది.. ఎంత విష ప్రచారం చేయాలో అంత విష ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వాన్ని అడ్డగోలుగా విమర్శించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సానా సతీష్ ను ఇష్టానుసారంగా విమర్శించింది. నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేసింది.. సానా సతీష్ నాయకత్వంలో ఆంధ్ర క్రికెట్ మొత్తం భ్రష్టు పట్టిపోయిందని.. ఆటగాళ్లు మొత్తం జట్టును వదిలి వెళ్ళిపోతున్నారని.. ఆర్థికంగా అవక తవకలు కూడా జరుగుతున్నాయని.. ఇలా లేనిపోని విమర్శలు చేసింది. వైసిపి తన సొంత మీడియాలో ఇష్టానుసారంగా ఆరోపణలు చేసింది. వాస్తవానికి ఆంధ్ర క్రికెట్ లో ఏం జరుగుతుందో తెలియని కొంతమంది పై ఆరోపణలను నమ్మారు. సానా సతీష్ పై విమర్శలు చేశారు. వైసీపీ ఎంత విష ప్రచారం చేస్తున్నప్పటికీ సానా సతీష్ సహనంతోనే ఉన్నారు. తన మౌనమే అన్నిటికి సమాధానం అన్నట్టుగా నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు.. ఇప్పుడు తన మదిలో ఉన్న ఒక్కొక్క ప్రణాళికను అమలు చేసుకుంటూ వస్తూ ఉండడంతో నిన్నటిదాకా విమర్శించిన వైసిపి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ఏకంగా బీసీసీఐ పెద్దలే ఆశ్చర్యంగా చూస్తున్నారు.
Also Read: ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ.. వైసిపి సంచలన నిర్ణయం!
టిడిపిలో కీలకంగా ఉన్న సానా సతీష్.. నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడుగా కొనసాగుతున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. జట్టును బలోపేతం చేసే క్రమంలో పటిష్టమైన ప్రణాళికలను అమలు చేస్తున్నారు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ 2021 లో న్యూజిలాండ్ జట్టు దక్కించుకునేలా చేసిన కోచ్ స్టీడ్ ను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు సానా సతీష్.. ఆంధ్ర క్రికెట్ జట్టుకు శిక్షకుడిగా నియమించారు. విహారి ఇతర జట్టుకు వెళ్లిపోవడంతో..రికి భుయ్ ని సారధిగా నియమించారు. ఉత్తర్ ప్రదేశ్ ఆటగాడు సౌరభ్ ను జట్టులోకి తీసుకున్నారు. అతడు ఎడమ చేతివాటం స్పిన్నర్. ఆంధ్రప్రదేశ్ జట్టుకు అతడిని ప్రొఫెషనల్ ఆటగాడిగా నియమించుకున్నారు సానా సతీష్.
గడిచిన సంవత్సరంలో దేశవాళి క్రికెట్లో ఆంధ్ర క్రికెట్ జట్టు కొంతగా ఆకట్టుకోలేదు. రంజీలలో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. పలు టోర్నీలలో నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో జట్టును బలోపేతం చేయడానికి సానా సతీష్ బలంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని.. డొమెస్టిక్ విభాగంలో జట్టును ప్రథమ స్థానంలో ఉండేలా చేస్తున్నారు. ఒకవేళ సతీష్ ప్రణాళికలు విజయవంతమైతే డొమెస్టిక్ క్రికెట్లో ఆంధ్ర జట్టు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.