Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu Sakshi cartoon: చంద్రబాబు గొప్పతనాన్ని చాటి చెప్పిన సాక్షి కార్టూన్

Chandrababu Naidu Sakshi cartoon: చంద్రబాబు గొప్పతనాన్ని చాటి చెప్పిన సాక్షి కార్టూన్

Chandrababu Naidu Sakshi cartoon: సాధారణంగా సాక్షి మీడియాలో( Sakshi media) చంద్రబాబుకు వ్యతిరేకంగానే వార్తలు వస్తాయి. చంద్రబాబు వ్యతిరేక వార్తలేనిది సాక్షి దినపత్రిక లేదు. అటువంటి సాక్షిలో అమరావతి విషయంలో వ్యతిరేక వార్తలు అనేవి సహజం కూడా. ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధత వస్తున్న నేపథ్యంలో వ్యతిరేక కథనాలను వండి వార్చుతోంది సాక్షి. ఈ క్రమంలో చంద్రబాబు అమరావతి విషయంలో పిల్లి మొగ్గలు వేస్తున్నారంటూ ఓ కార్టూన్ వచ్చింది. ఇప్పట్లో అమరావతి రాజధానిని చంద్రబాబు పూర్తి చేయలేరు అన్నది ఆ కార్టూన్ అర్థం. అయితే కార్టూన్ గీసిన వారి ఆలోచన కరెక్టే కానీ.. అది చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ కార్టూన్ హైలెట్ అవుతోంది.

వ్యతిరేకంగా చూపించాలనుకుని..
ఈ కార్టూన్ పై ( cartoon) ఐదు చిత్రాలను గీశారు. అమరావతి నేమ్ బోర్డును మూడుసార్లు చంద్రబాబు చూపించారు. నాలుగో సారి పిల్లి మొగ్గ వేసినట్లు చూపించారు. ఐదోసారి మాత్రం అమరావతి చిత్రపటంతో రైతుతో మాట్లాడినట్టు చూపించారు. దానికి ‘ ఇదేదో ఒక్క రోజులో అయ్యేది కాదు! ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేం. అంతం కాదు ఇది ఆరంభం’.. అనే క్యాప్షన్ ఇచ్చారు. ఏపీ అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు వైఖరి ఇది అని చెప్పే ప్రయత్నం చేశారు సాక్షి మీడియాలో.

సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్..
అయితే ఈ కార్టూన్ పట్టుకొని నెటిజెన్లు ఒక ఆట ఆడిస్తున్నారు. అందులో తప్పేముంది చంద్రబాబు ( CM Chandrababu)ఒకే మాటపై ఉంటున్నారు కదా? 2014 నుంచి 2019 మధ్య ఒక మాట.. పార్టీ ఓడిపోయిన 2019 నుంచి 2024 మధ్య అదే మాట. రైతుల త్యాగాలను కూడా సూచించారు చంద్రబాబు. అమరావతి విషయంలో చంద్రబాబు మాటలో మరో తేడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. పిల్లి మొగ్గలు వేసింది జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానిస్తున్న వారే అధికం. మొత్తానికి అయితే సాక్షి కార్టూన్ తో చంద్రబాబు ఔన్నత్యాన్ని గుర్తించడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular