పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తొలిసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రభుత్వం పై బురద చల్లాలని చూస్తే పవన్ కే ఇబ్బంది. ఆయనను సినీ పరిశ్రమ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారు. పవన్.. సినిమా రాజకీయాలు అనే రెండు పడవలపై కాళ్లు పెట్టారు.

పవన్ లాంటి వారితో ఇబ్బంది పడతామని సినిమా వారే భావిస్తున్నారు. ఆల్ లైన్ టికెటింగ్ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారు. ఈ విధనంతో పారదర్శకత సాధ్యం. సినీ పరిశ్రమ వారితో చర్చించేందుకు ఎప్పుడైనా సిద్ధమే అని అన్నారు. ఏపీలో సినీ పరిశ్రమకు వైకాపా ప్రభుత్వం మంచి చేయాలని చూస్తోందని అన్నారు. సినీ పరిశ్రమకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సినిమా థియేటర్లు ఎవరి చేతుల్లో ఉన్నాయో అందరికీ తెలుసునని, పవన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మటన్ షాపులు పెడతారన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ షాపుల్లో శుభ్రత పెంచేందుకు ఆలోచిస్తోంది అని సజ్జల అన్నారు.
బద్వేలు ఉప ఎన్నిక తమ పార్టీ అభ్యర్ధిగా దాసరి సుధను సీఎం జగన్ ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రజల అభిమానం, ఆదరణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఎప్పుడు ఉంటాయి. బద్వేల్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంటాం. బద్వేల్ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్తాం. సినిమా టికెట్ల ఆన్లైన్ విధానాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా థియేటర్లు ఎవరి చేతుల్లో ఉన్నాయో అందరికీ తెలుసు పవన్ కల్యాణ్ తీరు సినీ పరిశ్రమకే నచ్చడం లేదని అన్నారు. ఆన్లైన్ టికెట్ విధానం పై సినీ డి స్త్రీ బ్యూటర్ లు కూడా సంతోషం గా ఉన్నారని తెలిపారు.