APSRTC Women Free Travel Scheme: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. ఈనెల 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించనుంది. అయితే ఈ పథకం విషయంలో పూర్తి స్పష్టత రావడం లేదు. ఈ పథకం వర్తింపుపై అనేక రకాల సందేహాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి రకరకాల సంకేతాలు వస్తున్నాయి. అయితే వచ్చే క్యాబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు అస్పష్టత తప్పేలా లేదు. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమలు మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్ లకూ ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మొత్తం ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో ఉచితమా? కొత్త జిల్లాలకే పరిమితం చేస్తారా? లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: కల్లుగీత కార్మికులకు బార్లు!
చురుగ్గా ఏర్పాట్లు..
ఈనెల 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణానికి( free travelling) సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు, మెట్రో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి అనుమతిస్తారు. అయితే బస్సుల్లో సీసీ కెమెరాలు పెట్టాలని క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసు ఆందోళన రేపుతోంది.. ఇది మహిళలకు ఇబ్బందికరంగా మారుతుంది అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్డు సర్వీసులోనూ మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతించ వద్దంటూ క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేయడం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి- చెన్నై, అనంతపూర్ బెంగళూరు మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నడుపుతున్నారు. వెతికి ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించే ఛాన్స్ కనిపించడం లేదు. త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకం కోసం తుది మార్గదర్శకాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ పలు సూచనలు చేసింది. వాటిపై క్యాబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరో 10 రోజుల గడువు ఉండడంతో ముందుగానే మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఏపీలో కొత్త లుక్ లో 108 వాహనాలు!
వేర్వేరు ప్రకటనలతో అస్పష్టత..
అయితే మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అస్పష్టత కొనసాగుతోంది. ఒక్కో మంత్రి ఒక్కో ప్రకటన చేస్తున్నారు. కానీ దీనిపై ఫుల్ క్లారిటీ రావడం లేదు. కర్ణాటక తో పాటు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఏపీలో కూడా అంతటా ఉచిత ప్రయాణం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఆ రెండు రాష్ట్రాల్లో ఏపీ బృందం అధ్యయనం చేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఆ రాష్ట్రాల్లో పర్యటించి పథకాన్ని పరిశీలించారు. అక్కడ అమలవుతున్న తీరును అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.