AP 108 Ambulances New Look: ఏపీలో( Andhra Pradesh) అత్యవసర సేవలు అందించే 108 అంబులెన్సులు కొత్త లుక్ లో కనిపించనున్నాయి. వాటి రంగులను మార్చే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. వైసిపి ప్రభుత్వం వేసిన నీలం రంగును తొలగిస్తోంది. ఈ అంబులెన్స్ లలో అత్యధిక పరికరాలు ఉంటాయి. ఇకపై అంబులెన్సులు తెలుపు, ఎరుపు, పసుపు రంగులో మాత్రమే కనిపిస్తాయి. అంతేకాదు వాటికి రెఫ్లెక్టివ్ టేపులు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ అంబులెన్సుల రంగుల మార్పు కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో జరుగుతున్నాయి. సంజీవని పేరుతో వన్ జీరో ఫోర్ వాహనాలను కూడా తీర్చిదిద్దుతున్నారు. ఈ వాహనాలపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సత్య కుమార్ ఫోటోలు ఉంటాయి. కుశలవ కోచ్ లో ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ అంబులెన్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
రంగుల మార్పు..
ఇకపై రోడ్డుపైకి వచ్చే 104, 108 వాహనాలు కొత్త లుక్ లో కనిపించనున్నాయి. దివంగత రాజశేఖరరెడ్డి( y s Rajasekhar Reddy ) 108 అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆయన తరువాత వచ్చిన ప్రభుత్వాలు సైతం దానిని కొనసాగించాయి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో 108 సేవలు ప్రారంభమయ్యాయి. అయితే మన రాష్ట్రంలో మాత్రం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 108 వాహనాల రంగును మార్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పోలిన విధంగా రంగులను తీసుకొచ్చారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రంగులను మార్చే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వాహనాలకు రంగులతో పాటు మరమ్మత్తులు చేయనున్నారు. ఒకేసారి అందుబాటులోకి రానున్నారు.
Also Read: కల్లుగీత కార్మికులకు బార్లు!
పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతకు( road safety) సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది ఏపీ పోలీస్ శాఖ. ఈ మేరకు రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు బిజెపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అధిక వేగం, హెల్మెట్ లేని ప్రయాణం, బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక తనిఖీలు చేపడతారు. సోమవారం నుంచి పదో తేదీ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతాయి. 11 నుంచి 17 వరకు అధిక వేగంతో వెళ్లే వాహనాలపై నిఘా పెడతారు. 18 నుంచి 24 వరకు హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకుంటారు. 25 నుంచి 31 వరకు బ్లాక్ స్పాట్ ల వద్ద ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తారు.