Homeఆంధ్రప్రదేశ్‌Kalivi kodi Updates: ఆ పక్షి ఆచూకీ కోసం రూ.50 కోట్లు!

Kalivi kodi Updates: ఆ పక్షి ఆచూకీ కోసం రూ.50 కోట్లు!

Kalivi kodi Updates: ఏపీలో( Andhra Pradesh) అంతరించిపోతున్న పక్షి జాతిలో కలివికోడి ఒకటి. అయితే దీని జాడ కనిపెట్టేందుకు ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఈ కలివికోడి పురాతనమైన పక్షి జాతిలో ఒకటి. అప్పట్లో పెన్నా నది సమీపంలో ఈ జాతి పక్షులు కనిపించేవి. కాల క్రమంలో వీటి జాడ కనిపించేది కాదు. అయితే ఈ అరుదైన పక్షి జాతి కోసం పరిశోధనలు జరిగాయి. సుదీర్ఘకాలం సాగిన ఈ పరిశోధనలు ఫలించాయి. వైయస్సార్ కడప జిల్లాలో దీని ఆనవాళ్లను గుర్తించారు. ఆ కోడి అరుపులకు సంబంధించి ఆడియో కూడా రికార్డు చేశారు. అయితే ఈ పక్షి ఆచూకీ కనుక్కునేందుకు ఏకంగా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.

తొలిసారిగా అక్కడే..
ఈ కలివికోడి 1984 ప్రాంతంలో పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో సంచరించేదట. ఆ తర్వాత చాలాకాలం కనిపించలేదు. 1985 జనవరి 5న రెడ్డి పల్లెకు చెందిన చిన్న ఐతన్న ఈ పక్షిని గుర్తించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అటు తర్వాత ఆ పక్షి జాతి అంతరించిపోయిన పక్షుల జాబితాలో చేరింది. అప్పటినుంచి దానికోసం పరిశోధనలు ప్రారంభం అయ్యాయి.
* 1998 నుంచి 22 వరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిశోధకులు దీనికోసం వెతికారు.
* 2002లో ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ లంక మల లో దీని పాదముద్రికలు, కోతను రికార్డు చేసింది.
* వైయస్సార్ కడప జిల్లా కొండూరు దగ్గర చిట్టడవుల్లో ఈ పక్షి జాడ కనిపించింది. అందుకే ప్రభుత్వం మూడు వేల ఎకరాల్లో శ్రీలంక మల్లేశ్వర అభయ అరణ్యాన్ని ఏర్పాటు చేసింది.
* ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పక్షి జాడ కనుక్కునేందుకు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.

దాని ప్రత్యేకత అదే..
ఈ పక్షి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. 27 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ పక్షి కోత దాదాపు 200 మీటర్ల వరకు వినిపిస్తుంది. ఎత్తైన ముళ్లపదల్లో ఇవి నివసిస్తాయి. ఎగరలేని కారణంగా అక్కడే ఉంటాయి. పగటిపూట నిద్ర, రాత్రి ఆహార సేకరణ చేస్తాయి. గులకరాళ్ళను సేకరించి వాటి మధ్య గుడ్లు పెడతాయి. దశాబ్దాల కిందట అంతరించిపోయిందనుకున్న ఈ పక్షి జాతి ఎట్టకేలకు వెలుగులోకి రావడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular