Sankranthi Releases 2026: సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆ సినిమాలను చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి చూపిస్తుంటారు… ఈ సంక్రాంతికి సైతం తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి…ఇందులో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది. ఏ సినిమా డిజాస్టర్ గా మారుతోంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ప్రభాస్ హీరోగా వస్తున్న ‘రాజాసాబ్’, చిరంజీవి హీరోగా చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఈ సినిమాల నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్లలో ఏది ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంది అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం వచ్చిన అన్ని సినిమాల టీజర్, ట్రైలర్లను బట్టి చూస్తే రాజాసాబ్ సినిమా ట్రైలర్ కి కొంతవరకు పర్లేదు అనే టాక్ వస్తుంది… ఇక కొంతమంది ట్రైలర్ ను బట్టి సినిమా ఎలా ఉంటుందో డిసైడ్ చేస్తుంటారు.
ఇక మరి కొంతమంది మాత్రం ట్రైలర్ లో ఏముంది? ఇంతకుముందు వచ్చిన చాలా సినిమాల ట్రైలర్లు అద్భుతంగా ఉన్నప్పటికి ఆ సినిమాలు నిరాశపర్చాయి. కొన్ని సినిమాల ట్రైలర్లు బాగా లేకపోయిన కూడా ఆ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు… ప్రస్తుతం సంక్రాంతి బరి లో చాలా సినిమాలున్నప్పటికి ఉన్న నేపథ్యంలో ప్రభాస్, చిరంజీవి మధ్య విపరీతమైన పోటీ ఉంది.
ఇక వీళ్లలో ఎవరు సూపర్ సక్సెస్ సాధిస్తారు. వీళ్లిద్దరిని కాదని చిన్న హీరోలు సూపర్ సక్సెస్ ని సాధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయలైతే వ్యక్తమవుతున్నాయి… ఇక ఈ అన్ని సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…