AP Election Survey 2024: ఎన్నికల ముంగిట మరో ఆసక్తికర సర్వే వచ్చింది. ఏపీలో గెలవబోయే పార్టీ గురించి వెల్లడించింది. పోలింగ్ కు మరో 36 గంటల వ్యవధి ఉన్న నేపథ్యంలో వరుసగా సర్వే సంస్థలు ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందులో భాగంగా రైస్ సర్వే సంస్థ చిట్ట చివరి ఫైనల్ రిపోర్టు విడుదల చేసింది. మే 9 వరకు సేకరించిన శాంపిల్స్ ప్రకారంఈ ఫలితాలను వెల్లడించినట్లు సదరు సంస్థ చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రెండు లక్షల 80 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పుకొస్తోంది.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టిడిపి కూటమికి 101 నుంచి 114 స్థానాలు వస్తాయని.. వైసీపీకి 51 నుంచి 70 స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వే తేల్చి చెప్పింది. టిడిపి కూటమికి 51.8% ఓట్లు, వైసీపీకి 43.49% ఓట్లు వస్తాయని వెల్లడించింది. ప్రభుత్వంపై వ్యతిరేకత, ధరల పెరుగుదల, విద్యుత్ చార్జీలు, నిరుద్యోగం, లిక్కర్ ధరలు, రోడ్లు సరిగ్గా లేకపోవడం, ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత, అమరావతి రాజధాని అంశం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అనుమానం.. తదితర అంశాలు వైసిపి పై ప్రభావం చూపాయని ఈ సర్వేలో తేలింది.
మరోవైపు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని సర్వే తేల్చి చెప్పింది. పింఛన్ మొత్తం నాలుగు వేల రూపాయలకు పెంచడం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితం ప్రకటన ప్రజల్లోకి చొచ్చుకెళ్లినట్లు రైస్ సంస్థ చెబుతోంది. పోలింగ్కు 36 గంటల వ్యవధి ముందు వచ్చిన ఈ సర్వే వైరల్ అవుతోంది. అయితే ఈ సర్వే ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.