YCP: 2019 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? నేషనల్ సర్వే సంస్థలు చెప్పింది కరెక్ట్ అయ్యిందా? లోకల్ సర్వే సంస్థలు చెప్పింది నిజమైందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీకి సంబంధించి హాట్ టాపిక్ గా మారింది. ఆ ఎన్నికల్లో నేషనల్ మీడియా సర్వే సంస్థలు వైసీపీ దే విజయం అని తేల్చి చెప్పాయి. కానీ లోకల్ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు మాత్రం టిడిపి మరోసారి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. కానీ నేషనల్ సర్వే సంస్థలు చెప్పినట్టుగానే ఫలితాలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే లోకల్ సంస్థలు వైసీపీకి జై కొట్టగా.. నేషనల్ మీడియా సర్వే సంస్థలు మాత్రం కూటమి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని తేల్చి చెప్పడం విశేషం.
గత ఎన్నికల్లో లోకల్ సర్వే సంస్థలను నమ్ముకుని టిడిపి చాలా నష్టపోయింది. వారు టిడిపి దగ్గర డబ్బులు తీసుకుని వారికి అనుకూలంగా సర్వేలు ఇచ్చారు. అప్పుడు భారీగా నష్టపోయింది టిడిపి నే. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి ఎదురైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నేషనల్ మీడియా సంస్థలు చెబుతున్నట్టు వైసిపి కి ఘోర పరాజయం తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వైసీపీకి తిరుగు లేదన్న చానళ్లు, సర్వే సంస్థలు సైతం ఆ పార్టీకి ప్రతికూలంగా ఫలితాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రెడిబిలిటీకి సదరు సంస్థలు ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ మీడియా సంస్థలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. కొన్ని ప్రత్యేక అభిమాన ఛానళ్ళు కూడా ఆ పార్టీకి ఉన్నాయి. వాటికి వివిధ రూపాల్లో ప్రజాధనం కోట్లాది రూపాయలను కట్టబెట్టింది. జాతీయస్థాయిలో వైసీపీ ఇమేజ్ పెంచడానికి.. ఈవెంట్ నిర్వహించడానికి రకరకాలుగా నేషనల్ మీడియాను వాడుకుంది. ముఖ్యంగా ఎన్డి టీవీ ప్రతినిధులు అయితే వైసీపీ తరఫున బాహటంగానే కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్డి టీవీ, టైమ్స్ నౌ, ఇండియా టుడే వంటి ఛానల్ ను బాగానే కాకపట్టారు. ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు తాడేపల్లి లో ప్రత్యేక ఆతిథ్యం దక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చానళ్లు అన్ని ఇప్పుడు కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పడం విశేషం. అయితే ఇది తెలియని ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. ఎక్కడ ప్రతికూల ఫలితాలు ఇస్తాయో.. కూటమి వెనుక పడుతుందో అన్న ఆందోళనకు గురయ్యారు. ఏబీఎన్ ఆర్కే అయితే ఎగ్జిట్ పోల్స్ నమ్మవద్దు అని కూడా ప్రజలను కోరారు. అయితే ఇప్పుడు అదే నేషనల్ మీడియా టిడిపి కూటమి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని చెప్పడంతో ఖుషి అవుతున్నారు. తన కొత్త పలుకులో సరికొత్త రాతలతో చెలరేగిపోతున్నారు.