https://oktelugu.com/

Nara Lokesh tweet : ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ అదరహో.. లోకేష్ ట్వీట్.. ఊడిన జాబ్!

సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరిలో ఉన్న నైపుణ్యం బయటపడుతోంది. అందుకు సోషల్ మీడియా సరైన ప్లాట్ ఫామ్ గా మిగిలింది. అదే మాదిరిగా ఓ ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ నైపుణ్యం వెలుగులోకి వచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 29, 2024 / 01:25 PM IST

    Nara Lokesh Tweet

    Follow us on

    Nara Lokesh tweet :  ఆయన ఆర్టీసీ బస్సు డ్రైవర్. బస్సు ముందుకు కదల్లేని పరిస్థితుల్లో నిలిచిపోవడంతో.. విద్యార్థుల కళ్ళల్లో ఆనందం నింపాలని భావించారు.డాన్స్ చేసి వారిని మెప్పించారు.అయితే డ్రైవర్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ డ్రైవర్ అధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. కానీ అంతకుముందే మంత్రి నారా లోకేష్ ఆ డ్రైవర్ డాన్స్ ను చూసి ఫిదా అయ్యారు. కీప్ ఇట్ అప్ అంటూ మెచ్చుకున్నారు. సాక్షాత్ మంత్రి మెచ్చుకునేసరికి డ్రైవర్ పై సస్పెన్షన్ వేటు తొలగించారు. విధుల్లోకి తీసుకున్నారు ఆర్టీసీ అధికారులు. కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లోవరాజు అనే వ్యక్తి డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించబడ్డాడు.ఈనెల 24న రౌతులపూడి నుంచి తుని డిపోకు వెళ్తుండగా మార్గమధ్యమంలో కర్రల లోడు ట్రాక్టర్ అడ్డొచ్చింది. చిన్న రోడ్డు కావడంతో బస్సు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో బస్సు ఆపేసిన డ్రైవర్ లోవరాజు సరదాగా డాన్స్ చేశాడు. అక్కడే ఉన్న విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆర్టీసీ అధికారులు సదరు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల నుంచి తొలగించారు. అయితే అంతకంటే ముందే డ్రైవర్ లోవరాజు డాన్స్ వీడియోను మంత్రి లోకేష్ తిలకించారు. సూపర్ డాన్స్ చేశారు బ్రదర్. కీప్ ఇట్ అప్ అంటూ ఎక్స్ ద్వారా ప్రశంసించారు. అయితే ఆ ట్వీట్ చేయకముందే ఆర్టీసీ అధికారులు డ్రైవర్ పై చర్యలు తీసుకోవడానికి తెలుసుకున్న లోకేష్ స్పందించారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

    * సామాజిక అంశాలపై స్పందన
    ఇటీవల సామాజిక అంశాలపై స్పందిస్తున్నారు నారా లోకేష్. సానుకూల దృష్టితో ఆలోచిస్తున్నారు. గత కొద్ది రోజులుగా విదేశాల్లో చిక్కుకుంటున్న వారు సోషల్ మీడియా వేదికగా లోకేష్ ను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు లోకేష్. అయితే తాజాగా సరదా కోసం ఓ ఆర్టీసీ డ్రైవర్ చేసిన చిన్నపాటి వినోదం.. ఆయన ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. కానీ లోకేష్ సకాలంలో స్పందించి ఆ కుటుంబం వీధిన పడకుండా చూసుకున్నారు. క్రమశిక్షణ రాహిత్యం, నిర్లక్ష్యంతో చేసినది తప్పు అని.. ఆరోగ్యకరమైన వినోదం కోసం ప్రయత్నించడం తప్పు కాదని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అందుకే లోకేష్ స్పందించినట్లు తెలుస్తోంది.