Ram Charan vs Dil Raju: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) కచ్చితంగా ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తండిలాగానే ఒకపక్క రికార్డ్స్ తో సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తూ, మరో పక్కన నటన పరంగా కూడా తన సత్తా చాటుతూ అతి తక్కువ సమయం లోనే సూపర్ స్టార్ స్థాయికి ఎదిగాడు. ముఖ్యంగా #RRR చిత్రం తర్వాత ఆయన రేంజ్ ఎవ్వరూ అందుకోలేని స్థాయికి వెళ్ళిపోయింది. రామ్ చరణ్ డేట్స్ ఇస్తే చాలు బ్లాంక్ చెక్స్ ఇవ్వడానికి నిర్మాతలు క్యూలు కట్టారు. అంతటి స్థాయికి వెళ్లిన తర్వాత దిల్ రాజు(Dil Raju) లాంటి నిర్మాతతో సినిమా చెయ్యాలని ఏ స్టార్ హీరో కోరుకోడు. ఎందుకంటే ఆయన స్టైల్ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను తియ్యడం కాబట్టి. పెద్ద బడ్జెట్స్ కి రిస్క్ చెయ్యడు.
కానీ రామ్ చరణ్ దిల్ రాజు అడిగిన వెంటనే డేట్స్ ని కేటాయించాడు. పెద్ద బడ్జెట్ సినిమాని తీద్దాం అనుకున్నప్పుడు, అవుట్ డేటెడ్ శంకర్(Shankar Shanmugham) ని ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా ఎంచుకోవడమే దిల్ రాజు చేసిన అతి పెద్ద తప్పు. పైగా గ్లోబల్ వైడ్ గా తన స్టార్ స్టేటస్ ని పెంచుకున్న తర్వాత రామ్ చరణ్ నుండి అంతకు మించిన సినిమాని కావాలని కోరుకుంటారు అభిమానులు, ప్రేక్షకులు. కానీ శంకర్ పది సంవత్సరం క్రితం తీయాల్సిన ఒక పొలిటికల్ సబ్జెక్టు ని ఇప్పుడు రామ్ చరణ్ తో తీయాలని అనుకోవడం అతి పెద్ద పొరపాటు. ఆ పొరపాటు ని జరగనిచ్చింది దిల్ రాజు. కేవలం పాటల కోసం శంకర్ దిల్ రాజు చేత 75 కోట్లు ఖర్చు చేయించాడు. ఇదంతా వృధా ఖర్చే కదా?, రామ్ చరణ్ పాటలకు అంత బడ్జెట్ పెట్టమని చెప్పాడా లేదు కదా?.
అయినప్పటికీ దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రామ్ చరణ్ పై జనవరి నెల నుండి ఏడుస్తూనే ఉన్నారు. నిన్న శిరీష్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యాక మా ముఖాలను కూడా చూడలేదంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు పెద్ద ప్రకంపనలు రేపాయి. ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాల డేట్స్ ని కేటాయించాడు రామ్ చరణ్. మధ్యలో రెండు సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. కానీ ఈ సినిమా కోసమే వదులుకున్నాడు. ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే రామ్ చరణ్ ఈ నాలుగేళ్లలో కనీసం మూడు సినిమాలు అయినా చేసి ఉండేవాడు. 200 కోట్ల రూపాయిలు అదనంగా సంపాదించేవాడు. గేమ్ చేంజర్ లాంటి రెగ్యులర్ సబ్జెక్టు కి నాలుగేళ్ల డేట్స్ తీసుకోవడం ఎంత వరకు సబబు?, మీరే చెప్పండి ?, సినిమా ఫ్లాప్ అయ్యాక హీరో మీద ఇలా నిందలు వెయ్యడం తగునా?.