https://oktelugu.com/

Liquor: మోదీ సార్‌.. ఇదీ పాయింటే.. వన్‌ నేషన్‌.. వన్‌ రేటు కోసం మద్యం ప్రియుల కొత్త డిమాండ్‌

కేంద్రం డిసెంబర్‌ 17న లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. బిల్లు కూడా పెట్టింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 19, 2024 / 10:33 AM IST

    Liquor

    Follow us on

    Liquor: దేశంలో ఇప్పుడు అంతటా వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ గుచించే చర్చ జరుగుతోంది. ఎన్నికల వ్యయం తగ్గించడం, ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించడం, సమయం వృథా కాకుండా చూడడం, అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ నినాదం అందుకుంది. ఈ క్రమంలో ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా చేసింది. తర్వాత రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిషన్‌ వేసింది. కమిషన్‌ నివేదిక తర్వాత అందులోని సూచనల మేరకు కొత్త బిల్లును రూపొందించింది. లోక్‌సభ అనుమతితో డిసెంబర్‌ 17న లోక్‌సభలో బిల్లు పెట్టింది. అయితే దీనిని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇందుకు మోదీ కూడా ఓకే చెప్పారు. ఈమేరకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంతా దీనిపైనే చర్చ జరగుతోంది.

    కొత్తగా వన్‌ నేషన్‌.. వన్‌ రేట్‌ నినాదం..
    వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌పై ఒకవైపు చర్చ జరుగుతుండగానే.. మద్యం ప్రియులు ఇప్పుడు కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. మద్యం రేటు కూడా దేశమంతా ఒకేలా ఉండాలని కోరుతున్నారు. జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న వేళ ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే పన్ను విధానం అన్నప్పుడు ఒకే దేశం ఒకే రేటు ఎందుకు ఉండకూడాదన్న డిమాండ్‌ వస్తోంది. దయచేసి ఆలోచించండి అంటూ ట్వీట్‌ చేశాడు. గోవాలో రూ.320 ఉన్న వైన్‌ బాటిల్‌.. కర్ణాటకలో రూ.920 ఉందని పేర్కొన్నాడు. అందుకే వన్‌ నేషన్, వన్‌ రేట్‌ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు.

    మొన్నటి వరకు బంగారంపై..
    ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు బంగారం ధరలపై కూడా చాలా మంది వన్‌ నేషన్, వన్‌ రేట్‌ విధానం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కేలా రేట్లు ఉండడం ఏంటని ప్రశ్నించారు. జీఎస్టీ దేశమంతా ఒకేలా విధిస్తున్నప్పుడు ధరలు కూడా ఒకేలా ఉండాలని చాలా మంది కోరుతున్నారు. ఇక పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోరుతున్నారు. ఇలా వన్‌ నేషన్‌ వన్‌ రేట్‌ స్లోగన్‌ ఫేమస్‌ అయింది. ఇప్పుడు మందు బాబులు కూడా ఇదే స్లోగన్‌ అందుకున్నారు.

    ఐఆర్‌ఎస్‌ పోస్టుకు రిప్లయ్‌లు..
    ఐఆర్‌ఎస్‌ అధికారి పెట్టిన ట్వీట్‌పై చాలా మంది స్పందిస్తున్నారు. మోదీజీ ఈ నినాదం సరైనదే కదా అని పేర్కొంటున్నారు. అన్ని సరుకులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినప్పడు.. ధరలు కూడా ఒకేలా ఉండేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.