Homeఆంధ్రప్రదేశ్‌Redistribution of Constituencies In AP: ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన.. సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు!

Redistribution of Constituencies In AP: ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన.. సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు!

Redistribution of Constituencies In AP: ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి చర్చకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఓ ప్రొఫెసర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ విభజన చట్టంలో భాగంగా పునర్విభజన చేస్తామని చెప్పుకొచ్చారని.. అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఈరోజు విచారణ చేపట్టింది అత్యున్నత న్యాయస్థానం. అయితే ఇప్పటికే తనకు సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్న దృష్ట్యా.. ఈ పిటిషన్ పై విచారణ అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అందుకే ఆ పిటీషన్ ను కొట్టివేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పునర్విభజనకు సానుకూలంగా ఉందన్న సంకేతాలు ఇవ్వగలిగింది అత్యున్నత న్యాయస్థానం.

విభజన చట్టంలో స్పష్టం..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజిత ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని.. పునర్విభజన ఉంటుందని విభజన చట్టంలోనే పేర్కొంది. అయితే దీనిపై జాప్యం జరుగుతుండడంతో సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. దీంతో విచారణకు అంగీకరించింది సుప్రీంకోర్టు. అయితే విభజన చట్టంలో దేశవ్యాప్తంగా జనగణన పూర్తయితేనే పునర్విభజన సాధ్యమవుతుందని.. అది జరిగాక నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొంది. అయితే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అది పూర్తయ్యాక నియోజకవర్గాల పునర్విభజన అనేది ప్రారంభం కానుంది. ఇదే విషయాన్ని తాజాగా స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానం ఈ అభిప్రాయానికి వచ్చి ఉంటుంది.

Also Read: మహిళల చేతికి డ్రోన్లు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

జనగణన వాయిదా
వాస్తవానికి 2021లో జనగణన జరగాల్సి ఉంది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జన గణన జరుగుతుంది. చివరిసారిగా 2011లో జరిగింది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. అయితే పాలనాపరమైన సౌలభ్యం, రాష్ట్రాల పరిధిని దృష్టిలో పెట్టుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ 2021లో కరోనా కారణంగా జన గణన జరగలేదు. అయితే 2024 ఎన్నికల సమయానికి కూడా వివిధ కారణాలతో పూర్తి చేయలేకపోయారు. దీంతో 2029 ఎన్నికల నాటికైనా పునర్విభజన చేపట్టాలి అన్న ఉద్దేశ్యంతో ఉంది. అందులో భాగంగానే వచ్చే ఏడాదిలో జనగణన పూర్తి చేయాలని చూస్తోంది. పనిలో పనిగా కుల గణన కూడా పూర్తి చేయనుంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన సులువు కానుంది. రిజర్వేషన్ల వారీగా పునర్విభజన చేపట్టేందుకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. అయితే పునర్విభజనలో భాగంగా ఏపీలో మరో 50 నియోజకవర్గాలు పెరగనున్నాయి. దీంతో ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 225కి పెరగనున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version