ఆంధ్రప్రదేశ్‌YS Sharmila: షర్మిలపై కాంగ్రెస్ లో తిరుగుబాటు

YS Sharmila: షర్మిలపై కాంగ్రెస్ లో తిరుగుబాటు

YS Sharmila: ఏపీలో షర్మిల అనుకున్నది సాధించగలిగారా? కాంగ్రెస్ పార్టీని మెరుగైన స్థితికి తీసుకెళ్లగలిగారా? అంటే మొదటి దానికి సంతృప్తికరమైన సమాధానం వస్తోంది.రెండో దాని విషయంలో మాత్రం లేదనే జవాబు వస్తోంది. అన్నతో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టారు షర్మిల. అక్కడ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలోని రాజకీయం చేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ అందుకు అనుమతించలేదు. ఏపీ పగ్గాలు అప్పగించింది. అయితే అక్కడ కాంగ్రెస్ అధ్యక్ష స్థానం దక్కించుకున్న షర్మిల.. పార్టీ బలోపేతం కంటే అన్న జగన్ పతనాన్ని ఎక్కువగా కోరుకున్నారు. అందులో మాత్రం సక్సెస్ అయ్యారు. ఆమె పోరాట ఫలితమే కడప జిల్లాలోవైసిపి పతనం.కానీ ఆమె పోరాటం కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చలేదు.

కడప జిల్లా ప్రజలు మనసు మార్చేందుకు షర్మిల చేయని ప్రయత్నం అంటూ లేదు.కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె జిల్లా ప్రజలకు ఎన్నో రకాలుగా వినతులు ఇచ్చారు.ఆ మహానేత బిడ్డగా కొంగుచాచి అడుగుతున్నాను ఓటు వేయండి అని కోరారు.ఆమె తరుపున వివేక భార్య, కుమార్తె సైతం ప్రచారం చేశారు. వివేకానంద రెడ్డి ని హత్య చేసిన వారికి అండగా నిలబడతారో? బాధితులకు అండగా నిలబడతారో? తేల్చుకోవాలని జిల్లా ప్రజలను కోరారు.అయితే ప్రజలు మాత్రంఆమె మాటను విశ్వసించారు కానీ.ఆమెను ఆదరించలేదు. కూటమి వైపు మొగ్గు చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపారు. 10 సీట్లకు గాను ఏడు చోట్ల కూటమి అభ్యర్థులను గెలిపించారు. కానీ పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి త్రిముఖ పోటీలో అవినాష్ రెడ్డి ని గెలిపించారు. వైసిపి అసెంబ్లీ అభ్యర్థులు గెలవడం ద్వారా షర్మిల లక్ష్యం నెరవేరినా.. ఎంపీగా అవినాష్ రెడ్డి గెలుపు మాత్రం షర్మిలకు రుచించని విషయం.

అయితే ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. కేవలం జగన్ ను దెబ్బతీయాలని షర్మిల చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ విషయంలో మాత్రం ఆమె సక్సెస్ అయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీని లైమ్ లైట్లో తీసుకురావడంలో మాత్రం ఫైలయ్యారు. నిన్నటి వరకు ఆమె కాంగ్రెస్ పార్టీకి ఆశాదీపం అవుతారని భావించిన వారు నీరుగారిపోయారు. పార్టీలో సైతం ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణ ఇప్పుడు బయటకు వచ్చింది. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న సుంకర పద్మశ్రీ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. షర్మిలపై ఆరోపణలు చేశారు. ఆమెతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లాభం లేదని.. టిక్కెట్లు సైతం అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో సైతం షర్మిలపై తిరుగుబాటు ప్రారంభం అయినట్టు కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version