Rayapati Ranga Rao: టిడిపి కి మరో బిగ్ షాక్. ఆ పార్టీకి సీనియర్ నేత రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. టిడిపి నాయకత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. దిక్కుమాలిన పార్టీగా అభివర్ణించారు. అసలు అది రాజకీయ పార్టీయే కాదన్నారు. వ్యాపార సంస్థ అని ఆరోపించారు. తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు. గత ఎన్నికల్లో 150 కోట్ల రూపాయలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తమ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ చేశారు.
టిడిపికి రాజీనామా చేసే క్రమంలో రాయపాటి సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా కంపెనీ నేనే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఎక్కడ పని చేయించారని నిలదీశారు. కన్నా లక్ష్మీనారాయణ ఒక్క కులానికి పనిచేస్తాడని… అటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకున్నారని మండిపడ్డారు. అందుకే అటువంటి పార్టీలో ఇమడలేమని తేల్చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు.
ఈ సందర్భంగా రాయపాటి రంగారావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోలను తొలగించారు. రంగారావు అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వరుసగా కమ్మ సామాజిక వర్గం నేతలు పార్టీని వీడుతుండడంతో టిడిపిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. వారిని నియంత్రించే పరిస్థితి లేకపోవడం కూడా మైనస్ గా మారుతోంది. అయితే ఎన్నికల వేళ ఇది కామన్ అని.. నరసరావుపేట ఎంపీ స్థానం బీసీలకు కేటాయించడంతోనే రాయపాటి కుటుంబం కోపంతో రగిలిపోతోందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
ఎలా గెలుస్తాడో చూస్తా అంటూ చంద్రబాబు ఫోటో పగలగొట్టిన టిడిపి సీనియర్ నాయకుడు రాయపాటి రంగా రావు
ఇంకెందుకు జెండా పీకేయండి బాబు గారూ! #EndOfTDP pic.twitter.com/Qc3Dg0RINb
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) January 12, 2024