Ration: ఆర్థికంగా వెనుకబడిన వారికి బిలో పావర్టీ లైన్ కుటుంబాలని ఆహార భద్రత కార్డు అదేనండి రేషన్ కార్డును మంజూరు చేస్తుంటుంది ప్రభుత్వం. వివిధ రకాల రేషన్ కార్డులను మంజూరు చేస్తూ వారి జీవనానికి అవసరం అయ్యే ఆహార ధాన్యాలను ఇస్తుంటారు. అంతేనా పలు ప్రభుత్వ సేవలను కూడా ఈ రేషన్ కార్డు ద్వారానే అందిస్తుంటారు. రేషన్ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందుకే అన్ని రాష్ట్రాల్లో అర్హులైన వారికి ప్రభుత్వం ఈ రేషన్ కార్డును అందిస్తుంది. దీనిని బట్టే పథకాలను అందిస్తుంది.
ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ కీలక అప్డేట్ ను ఇచ్చింది. రాష్ట్రంలో రేషన్ పంపిణీని షురు చేస్తున్నట్టు తెలిపారు అధికారులు. ఎప్పటి లాగానే ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ మొదలవుతుందని, ఆపరేటర్లు బుధవారం ఉదయం 7 గం.ట నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారని తెలిపారు.
విటమిన్ బీ12, ఐరన్ కలిపిన పోషకవిలువలతో కూడిన బియ్యంతో పాటు పంచదార, గోధుమపిండి తగిన ధరలకే ఇంటి వద్దకు రానున్నాయని తెలిపారు. పోషక విలువలు ఉన్న ఫోర్టిఫైడ్ బియ్యం, పంచదార, గోధుమ పిండిని రేషన్ కార్డు దారులు సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. ఇక గోధుమ పిండి కేజీ రూ. 16గా ఉందట. ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రేషన్ పంపిణీలో వాలంటీర్లు పాల్గొనవద్దు అని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ వాలంటీర్ల స్థానంలో వీఆర్వోలు రేషన్ పంపిణీ చేస్తున్నారు.
రేషన్ బియ్యాన్ని అనధికారికంగా అమ్మడం, కొనడం రెండూ నేరమే. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇక నిత్యావసర సరుకులు పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చేయాలని సూచించారు.