https://oktelugu.com/

Ram Gopal Varma: ఏపీ పోలీసులకు షాక్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ.. ఏ క్షణం అయినా అరెస్ట్*

మరోసారి రాంగోపాల్ వర్మ వైఖరి చర్చకు దారితీస్తోంది. ఏ క్షణమైనా ఆయన అరెస్టు తప్పదని ప్రచారం సాగుతోంది. పోలీసులు విచారణకు హాజరు కావాలని సూచించినా ఆర్జీవి పెడచెవిన పెట్టారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 25, 2024 / 11:29 AM IST

    Ram Gopal Varma

    Follow us on

    Ram Gopal Varma: ఏపీ పోలీసులకు రామ్ గోపాల్ వర్మ మరోసారి షాక్ ఇచ్చారు.ఈరోజు సైతం ఆయన విచారణకు హాజరు కాలేదు. కొద్ది రోజుల కిందట ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మ కు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.విచారణకు హాజరుకావాలని సైతం సూచించారు.అయితే రకరకాల కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు ఆర్జీవి. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు,లోకేష్, పవన్ కుటుంబాలపై రాంగోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఫోటోలు మార్ఫింగులు చేసి పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీనిపై తాజాగా ఓ టిడిపి నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుకు రావాలని రాంగోపాల్ వర్మ కు నోటీసులు అందించారు. అయితే తనకు నాలుగు రోజుల సమయం కావాలని కోరారు ఆర్జీవి.అయితే పోలీసులు ఆరు రోజుల సమయం ఇచ్చారు.ఆ గడువు నేటితో ముగిసింది. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం విచారణకు హాజరు కాలేదు. మరోసారి ముఖం చాటేసారు.

    * సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్
    గత ఐదేళ్ల వైసిపి పాలనలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. ఒకవైపు చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమాలు తీసుకునే.. ఇంకో వైపు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను టార్గెట్ చేసుకున్నారు.చాలా సందర్భాల్లో వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగారు. అయితే వైసిపి అధికారంలో ఉండడంతో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ సైలెంట్ అయ్యారు. అయితే ఇటీవల వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో..రాంగోపాల్ వర్మపై వచ్చిన ఫిర్యాదుతో పోలీసు శాఖరంగంలోకి దిగింది.ఆర్జీవి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.అయితే విచారణకు హాజరైన క్రమంలో తనను అరెస్టు చేస్తారని రామ్ గోపాల్ వర్మ అనుమానంతో ఉన్నారు.అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

    * హైకోర్టును ఆశ్రయించిన వైనం
    ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చిన క్రమంలో రాంగోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. తనపై విచారణను రద్దు చేయాలని..తనను అరెస్టు చేయకుండా నియంత్రించాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అందుకు కోర్టు తిరస్కరించింది. అరెస్టును నియంత్రించే పని చేయలేమని తేల్చి చెప్పింది. అందుకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేమని తేల్చేసింది. అవసరమైతే బెయిల్ పిటిషన్ పెట్టుకోవాలని సూచించింది.అదే సమయంలో విచారణకు వెళ్లాల్సిన రామ్ గోపాల్ వర్మ.. తనకు నాలుగు రోజుల సమయం కావాలని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు ఆరు రోజుల పాటు సమయం ఇచ్చారు. ఆ గడువు నేటితో ముగిసింది. ఆర్జీవి విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈరోజు కూడా ఆయన గైర్హాజరయ్యారు.

    * బెయిల్ పిటిషన్ పెండింగ్లో
    ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది.దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. అదే సమయంలో పోలీసులు ఇచ్చిన గడువు కూడా ముగిసినా ఆర్జీవి విచారణకు హాజరు కాలేదు. దీంతో రాంగోపాల్ వర్మను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇటువంటి సమయంలో హైకోర్టు ఇచ్చే ఆదేశాలగురించి అంతా ఎదురుచూస్తున్నారు.