Niharika Konidela: మెగా బ్రదర్ నాగబాబు(Konidela Nagababu) కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెల(Niharika Konidela) కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవడం తో నటిగా నిహారిక కొణిదెల కెరీర్ ని కొనసాగించలేకపోయింది. ఇక ఆ తర్వాత ఆమె చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొంతకాలం వీళ్లిద్దరి దాంపత్య జీవితం సజావుగానే సాగినప్పటికీ, ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత తన తండ్రి ఇంట్లోనే ఉంటున్న నిహారిక, కెరీర్ పరంగా నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లు నిర్మించింది. అదే ఊపులో ఆమె ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రాన్ని కూడా నిర్మించింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. నిహారిక కొణిదెల కి లాభాల వర్షాలు కురిపించింది ఈ చిత్రం.
Also Read: హిందీ డైరెక్టర్స్ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఏకైక తెలుగు హీరో అతనే!
ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం కెరీర్ మీదనే ఉంది, నిర్మాతగా ఆమె మరికొన్ని విజయాలను అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి సమయం లో నిహారిక రెండవ పెళ్లి గురించి సోషల్ మీడియా లో అనేక చర్చలు నడుస్తున్నాయి. ఇప్పట్లో తనకి రెండవ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని నిహారిక పలు ఇంటర్వ్యూస్ లో చెప్పినప్పటికీ కూడా ఈ రూమర్స్ కి చెక్ పడడం లేదు. రీసెంట్ గా ఈమె ప్రముఖ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) తో ప్రేమాయణం నడుపుతుందని, వీళ్లిద్దరు కలిసి రీసెంట్ గానే ఒక రెస్టారంట్ కి వెళ్లి డిన్నర్ చేసారని యూట్యూబ్ లో కొన్ని ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి పెట్టడం పై మెగా అభిమానులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ఇలాంటి ఫేక్ వార్తలకు దూరం ఉండాలని, వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్న విషయం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా సోషల్ మీడియా లో నిరూపించారు. దీంతో ఈ ఫేక్ రూమర్స్ కి చెక్ పడింది.