Homeఆంధ్రప్రదేశ్‌AP Rajya Sabha seats: ఏపీలో రాజ్యసభ పదవులు వారికే.. తేల్చేసిన ప్రభుత్వ సన్నిహితుడు!

AP Rajya Sabha seats: ఏపీలో రాజ్యసభ పదవులు వారికే.. తేల్చేసిన ప్రభుత్వ సన్నిహితుడు!

AP Rajya Sabha seats: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. జూన్లో ఏపీకి చెందిన ఓ నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నాలుగు ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఈ నాలుగు సీట్లు కూటమికి దక్కుతాయి. దీంతో మూడు పార్టీల్లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటారని పేరున్న సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఎవరెవరికి రాజ్యసభ పదవులు దక్కుతాయో వెల్లడించారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నలుగురి పదవీ విరమణ..
ఏపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని రాజ్యసభ సభ్యులుగా పదవీ విరమణ చేయనున్నారు. ఈ ముగ్గురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన వారే. అయితే అప్పట్లో బీజేపీ విన్నపం మేరకు పారిశ్రామిక కోటాలో పరిమల్ నత్వానికి అవకాశం ఇచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఆయన బిజెపి సభ్యుడిగానే కొనసాగారు. మరోవైపు టిడిపికి చెందిన సానా సతీష్ పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయన ఏడాదిన్నర కిందట కూటమి వచ్చిన తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. అందుకే ఆయనకు ఈసారి కొనసాగింపు ఉంటాదని ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడు మిగిలిన మూడు రాజ్యసభ పదవులు.. టిడిపి,, జనసేన, బిజెపి ఒక్కొక్కటి తీసుకుంటుందని తెలుస్తోంది. అయితే ఈ మూడు పదవులు ఎవరెవరికి దక్కబోతున్నాయి అనేది ప్రవీణ్ పుల్లట వెల్లడించారు. ప్రభుత్వంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన ట్విట్ ఇప్పుడు సంచలనం గా మారింది.

సోషల్ మీడియాలో ట్వీట్..
ఈ మూడు మిగిలిన పదవులకు సంబంధించి టిడిపి నుంచి భాష్యం రామకృష్ణ, జనసేన కోటాలో లింగమనేని రమేష్ బాబు, బిజెపి నుంచి తమిళనాడు నేత అన్నామలైకు అవకాశం ఇస్తారని ప్రవీణ్ పుల్లట నిన్ననే సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి కూటమి ఘనవిజయం సాధిస్తుందని ప్రవీణ్ పుల్లట చెప్పుకొస్తూ వచ్చారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వ వర్గాల తో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనే స్వయంగా ఈ పేర్లు ప్రకటించడంతో.. ఖరారు అయినట్టేనని భావిస్తున్నారు.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular