YSR Congress : వైసీపీలోకి( YSR Congress) కీలక నేతలు రానున్నారా? నాటి రాజశేఖర్ రెడ్డి కి అత్యంత విధేయులు ఇప్పుడు జగన్ కు అండగా నిలవనున్నారా? ఈ మేరకు తెర వెనుక వ్యూహం రూపొందుతుందా? వచ్చే ఎన్నికల్లో వైసీపీని గట్టెక్కించడమే వారి ధ్యేయమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం చవిచూసింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఈ తరుణంలో పార్టీకి భవిష్యత్తు లేదనుకున్న భావిస్తున్న నేతలు గుడ్ బై చెబుతున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన బాటలోనే కీలక నేతలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.దీంతో వైసిపి అత్యంత ప్రమాదకరంలో పడింది.
* వరుసగా సీనియర్లు
అయితే తాజాగా పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజానాథ్( Sake sailaja Naath) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో మరింత మంది నేతలు వైసీపీలో చేరుతారని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి విధేయ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలోకి వస్తారన్న టాక్ ప్రారంభం అయ్యింది. ఆయన రాజశేఖర్ రెడ్డి కి అత్యంత విధేయుడైన నాయకుడు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే రెండుసార్లు రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజన లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరు నిరసిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అప్పటినుంచి ఏ పార్టీలో చేరలేదు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధపడినట్లు సమాచారం. త్వరలో ఆయన చేరిక ఉంటుందని వైసీపీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది.
* పాదయాత్ర సమయంలో
2003లో ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ). ఆ సమయంలోనే తూర్పుగోదావరి జిల్లాలో యాక్టివ్ గా పని చేస్తున్న నేతల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కనిపించారు. మంచి వాగ్దాటితో పాటు సమకాలిన రాజకీయ అంశాలపై ఆయనకున్న అవగాహనను గుర్తించారు రాజశేఖర్ రెడ్డి. 2004 సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచారు ఉండవెల్లి. 2009 ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ పై సుదీర్ఘకాలం పోరాటం చేశారు తండ్రి అకాల మరణంతో పార్టీ నుంచి వెళ్తానన్న జగన్మోహన్ రెడ్డిని సముదాయించారు. అయినా సరే ఆయన వినలేదు. 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్.
* పదేళ్లుగా రాజకీయ విశ్లేషకుడిగా
అయితే గత పది సంవత్సరాలుగా రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగుతున్నారు ఉండవల్లి( undavalli Arun Kumar ). సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడుతూ ప్రభుత్వాలు, పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఆయనకు అండగా నిలవాలని నిర్ణయించారు. సాకే శైలజానాథ్ వైసీపీలో చేరిన క్రమంలో.. త్వరలో ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం వైసీపీలో చేరుతారని ప్రచారం ప్రారంభమైంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.