AP Rains: ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఇది ప్రస్తుతం కొనసాగుతోంది. ఝార్ఖండ్ తో పాటు చత్తీస్గడ్ వైపు వెళ్తోంది. మరోవైపు గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ మీదుగా బ్రో ని కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు అని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
Also Read: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు!
* ఈదురు గాలుల హెచ్చరిక..
ఏపీలో ఉత్తరాంధ్రతో( North Andhra) పాటు ఉత్తర కోస్తాకు వర్ష సూచన అధికంగా ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవరున్నాయి. అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సైతం వర్షాలు పడే అవకాశం ఉంది.
* భారీగా వర్షపాతం నమోదు..
గడిచిన 24 గంటల వ్యవధిలో ఏలూరు జిల్లా పోలవరం లో( polavaram) 53.6 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 52.6, అల్లూరి సీతారామరాజు జిల్లా వర రామచంద్రాపురంలో 50.2, అనకాపల్లిలో 47.8, ఎన్టీఆర్ జిల్లా పాలరు బ్రిడ్జి 46.6, రాజమండ్రిలో 43, విశాఖపట్నంలో 42.6, ఏలూరు జిల్లా చింతలపూడిలో 40.2, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 39.6, పల్నాడు జిల్లా మాచర్లలో 38.6, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 35.2, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో 35.2, యానంలో 35.2, ప్రత్తిపాడు లో 32.8, తునిలో 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆదివారం వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.