Homeఆంధ్రప్రదేశ్‌Rain Alert in AP : ఏపీలో ఆ జిల్లాల్లో కుండపోత.. బిగ్ అప్డేట్!

Rain Alert in AP : ఏపీలో ఆ జిల్లాల్లో కుండపోత.. బిగ్ అప్డేట్!

Rain Alert in AP  : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముందస్తుగానే రుతుపవనాలు పలకరించడంతో వర్షాలు ప్రారంభం అయ్యాయి. అల్పపీడనాలతో పాటు వాయుగుండాల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అప్రమత్తం అయ్యింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఋతుపవనాల ప్రభావం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సముద్ర తీరం వెంట కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

Also Read : దేశంలో టాప్ పర్సనాలటీస్ : జగన్, పవన్ లలో ఎవరికి ఎక్కువ ఆదరణ అంటే?

* స్థిరంగా వాయుగుండం
పారాదీప్ నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయి ఉంది. ఫలితంగా ఈరోజు కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైయస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

* అత్యధిక వర్షపాతం..
మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. గురువారం సాయంత్రం ఐదు గంటల నాటికి పల్నాడు జిల్లా రెంటపాళ్లలో 47.5 మిల్లీమీటర్లు, గరికపాడు లో 41, సత్తెనపల్లిలో 34.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. తెలంగాణలో సైతం నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించాయి. అక్కడ కూడా భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. అయితే ఈసారి తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది రోజులు ముందుగానే రుతుపవనాలు తాకాయి. జూన్ 2 వరకు ఇవి స్థిరంగా కొనసాగనున్నాయి. అప్పట్లో గా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం పెద్దగా లేకుండా పోయింది.

* ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు..
మరోవైపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో చాలాచోట్ల సముద్రంలో అలజడి నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాల్లోని తీర ప్రాంతాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. తీరం కోతకు గురవుతోంది. సముద్రంలో అలజడి నెలకొన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే వర్షాలు అన్నిచోట్ల పడకపోవడం విశేషం. కొన్ని ప్రాంతాల్లో అయితే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు పడడం లేదు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version