Raghurama Krishna Raju Home Minister Post: ఇటీవల ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Deputy speaker Raghurama Krishna Raju) తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన తానా సభలకు హాజరయ్యారు. అక్కడ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జరిగిన అవమానాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణం రాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు రఘురామకృష్ణంరాజు. మంత్రి పదవి కోరుకున్నారు. వివిధ సమీకరణల దృష్ట్యా చంద్రబాబు అవకాశం కల్పించలేకపోయారు. డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇవ్వడంతో అలా సర్దుకున్నారు రఘురామ. కానీ ఇప్పుడు తానా మహాసభల్లో తనకు రెండు మంత్రిత్వ శాఖలపై ఆశ ఉందని తేల్చి చెప్పారు. ఆ రెండు శాఖలు తనకు అప్పగిస్తే తన పనితీరును చేసి చూపిస్తానని అన్నారు.
కొద్ది రోజులకే రెబల్ గా
ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party ) చేరారు రఘురామకృష్ణంరాజు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారు. ఆ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. కానీ కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఆ పార్టీకి దూరమయ్యారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం ఆయనను సస్పెండ్ చేయలేదు. అనర్హత వేటు వేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. నిత్యం అప్పటి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు రఘురామకృష్ణం రాజు. ఈ క్రమంలో ఆయన అరెస్టు కూడా జరిగింది.
Also Read: చెప్పేవి శ్రీరంగనీతులు.. మీడియాను వ్యాపారం చేసేశారు.. ఇదే ‘యాపారం’
అరెస్టు చేసి చిత్రహింసలు..
వైసిపి రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజును ఓ పుట్టినరోజు నాడు హైదరాబాద్( Hyderabad) వెళ్లి ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాజ ద్రోహం కేసు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటి పోలీస్ అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో.. విచారణ పేరిట చేయి చేసుకున్నారని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తరువాత కోర్టుకు వెళ్లి ఊరట దక్కించుకున్నారు. అయితే నాడు తనకు ఎదురైన పరాభవాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. భారతీయ జనతా పార్టీలో చేరి.. మరోసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బిజెపి ఆయనకు చాన్స్ ఇవ్వలేదు. దీంతో చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి తీసుకోవాలని భావించారు. తద్వారా తనకు ఎదురైన పరాభవానికి రివేంజ్ తీసుకోవాలని చూశారు. కానీ ఆయనకు మంత్రి పదవి లభించలేదు.
Also Read: అమరావతి 2.0.. కలల రాజధానిపై కొత్త సందేహాలు?
తానా సభల్లో సంచలనం
అయితే తాజాగా తానా(Tana) మహాసభలకు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణం రాజుకు ఆహ్వానం అందింది. దీంతో ఆ మహాసభలకు హాజరయ్యారు. అక్కడ ఓ ఇంటర్వ్యూర్ ఇప్పుడు కానీ మీకు మంత్రి పదవి ఇస్తే ఏ శాఖను తీసుకుంటారు అంటూ అడిగారు. అయితే శాసన సభ్యులంతా ముక్తకంఠంతో కోరి తనకు మంత్రి పదవి ఇప్పిస్తే ఓ రెండు శాఖలను తీసుకుంటానని బదులిచ్చారు రఘురామ. రోజులో హోం శాఖను ఎనిమిది గంటలు, వైద్య ఆరోగ్యశాఖను రెండు గంటలు ఇస్తే తనకు ఎదురైన రక్తధారకు కారణమైన ఘటనలపై దర్యాప్తు చేయిస్తానని చెప్పుకొచ్చారు. తన వద్ద రెడ్ బుక్ లేదని.. అది వేరే వారి వద్ద ఉందని.. తన వద్ద ఉన్నది బ్లడ్ బుక్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో అక్కడ నవ్వులు విరిసాయి. రఘురామకృష్ణంరాజు అంత పగతో రగిలిపోతున్నారా? అనే చర్చ బలంగా జరుగుతోంది.
మొరటోడికి మొగలిరేకులు ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట.. అలా ఉంది సిగ్గులేని విగ్గురాజు నిర్వాకం
హోంమంత్రి పదవి కావాలంట … అది కూడా కక్ష తీర్చుకోవడానికంట pic.twitter.com/igAuDxIQbA
— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) July 6, 2025