NTR Centenary Celebrations : ఎన్టీఆర్ శతజయంతి.. పరువు పాయే.. మన ఎర్రన్న స్పీచ్ హైలెట్

ఎంజీఆర్ కు భార‌త‌రత్న ఇచ్చారు కానీ ఆయ‌న కంటే గొప్ప వ్య‌క్తి అయిన ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్నఇవ్వలేదని బాధను వ్యక్తం చేశారు.

Written By: Dharma, Updated On : May 22, 2023 12:29 pm
Follow us on

NTR Centenary Celebrations : ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తుల్లో విప్లవ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఒకరు. సమకాలిన సామాజిక అంశాలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే ఆయన కఠువుగా మాట్లాడతారు. ముఖాన్నే ఏ విషయమైనా చెప్పేస్తారు. అటువంటి వ్యక్తిని ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు అతిథిగా పిలిచారు. ఆయన కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్ గొప్పతనం గురించి చాలా విధాలుగా చెప్పారు. అయితే ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వకపోవడాన్ని కుట్రగా అభివర్ణించారు. చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యుల ఎదుటే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవే వైరల్ అవుతున్నాయి. నారాయణమూర్తిగారు అదిరిపోయే పంచ్ లు ఇచ్చారంటూ నెటిజన్లు అభినందనలు చెబుతున్నారు.

నందమూరి తారక రామారావు ఎన్నో సాధించారు. కానీ ఆయనకు భారతరత్న ప్రకటించకపోవడం లోటే. తెలుగు తెరకు మకుటం లేని మహరాజు నందమూరి తారక రామారావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు..తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని విశ్వవ్యాపితం చేసిన మహా నాయకుడు కూడా. నటుడిగా, రాజకీయ నేతగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. ఎన్టీఆర్ ప్రవేశంతో తెలుగు సినిమా చరిత్ర గతి మారింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ తెలుగు నేల గతిని మార్చింది. ప్రాంతీయ పార్టీని స్థాపించి జాతీయ స్థాయి రాజకీయాలకు దిక్సూచిగా నిలిచారు. అనిశ్చితి రాజకీయాలను అధిగమించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీ రోల్ ప్లే చేశారు. కానీ ఆయన సేవలకు మాత్రం ఇప్పటివరకూ గుర్తింపు లభించలేదు.

ఎన్టీఆర్ మరణానంతరం కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామ్యమైనా ఎన్టీఆర్ కు భారతరత్న దక్కలేదు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు ఫెయిల్యూర్ అన్న ప్రచారం ఉంది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తులో ఉండి అధికారం పంచుకున్న కూడా ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న ఇప్పించ‌లేక‌పోయారంటూ చంద్ర‌బాబును ఎద్దేవా చేశారు. అలాగే ఎన్టీఆర్ కుమారై పురందేశ్వ‌రి కూడా ఎన్టీఆర్ కు భార‌త‌రత్న ఇప్పించ‌డం కోసం ప్ర‌య‌త్నించాల‌ని.. కేవ‌లం రూ. 100 కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ పెట్టించ‌డంతో స‌రిపోదని నారాయణమూర్తి ఆవేశంగా మాట్లాడారు.

ఎంజీఆర్ కు భార‌త‌రత్న ఇచ్చారు కానీ ఆయ‌న కంటే గొప్ప వ్య‌క్తి అయిన ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్నఇవ్వలేదని బాధను వ్యక్తం చేశారు.  అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు గ‌ట్టిగా పోరాటం చేయ‌ల్సింద‌ని… ఇప్ప‌టికైనా తెలుగు రాష్ట్రాల సీఎంల‌తో పాటు సినీ ప‌రిశ్ర‌మ కూడా పోరాడాల‌ని  నారాయణమూర్తి వేడుకున్నారు. మొత్తానికైతే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో నారాయణమూర్తి స్పీచ్చే హైలెట్ గా నిలిచింది. చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులను ఎర్రన్న భలే వేసుకున్నారు. అటు ఎన్టీఆర్ అభిమానులను సైతం ఖుషీ చేశారు.