Purandeswari Cabinet : ఏపీ( Andhra Pradesh) బీజేపీకి నూతన సారథి వచ్చారు. ఉత్కంఠకు తెరదించుతూ బిజెపి హై కమాండ్ పివిఎన్ మాధవ్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అనేక పుకార్లు వచ్చాయి. వాటన్నింటినీ తెరదించుతూ మాధవ్ పేరు ఖరారు అయ్యింది. మరోసారి పురందేశ్వరికి కొనసాగింపు లభిస్తుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. దీంతో పురందేశ్వరి మాజీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆమెకు ఎలాంటి పదోన్నతి కల్పిస్తారు అన్నది చర్చకు దారితీస్తోంది. కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుంటారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తప్పకుండా ఆమెకు పదోన్నతి ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read: జగన్ కంట్లో నలుసుగా ఒకప్పటి వీర విధేయుడు!
కేంద్ర మంత్రిగా అవకాశం..2024 సార్వత్రిక ఎన్నికల్లో( general elections ) పొత్తులో భాగంగా రాజమండ్రి ఎంపీగా పోటీ చేశారు పురందేశ్వరి. అత్యధిక మెజారిటీతో గెలిచారు. దీంతో ఆమెను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటారని అంతా భావించారు. ఎన్టీఆర్ కుమార్తె కావడం, బలమైన సామాజిక వర్గ నేపథ్యం ఉండడం, మహిళా నేత కావడం, గతంలో కేంద్రమంత్రిగా వ్యవహరించడంతో.. ఆమెను కేంద్రమంత్రిగా ఎంపిక చేస్తారని అంతా భావించారు. అయితే బిజెపి నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కు అనూహ్యంగా చాన్స్ దక్కింది. అయితే అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండడం వల్లే మంత్రిగా అవకాశం దక్కలేదని భావించారు. అయితే ఇప్పుడు కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునేందుకే ఆమెకు రెండోసారి బిజెపి రాష్ట్ర పగ్గాలు ఇవ్వనట్లు తెలుస్తోంది.
డిప్యూటీ స్పీకర్ పోస్ట్..
మరోవైపు పురందేశ్వరికి( purantheswari ) కేంద్ర డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ప్రతిపక్షానికి ఇవ్వాలి. ప్రధాన ప్రతిపక్షానికి చాన్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2019 నుంచి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ను భర్తీ చేయలేదు ఎన్డిఏ ప్రభుత్వం. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎండ్ ఏ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీ చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఏపీ నుంచి పురందేశ్వరికి ఆ అవకాశం ఇస్తారని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read: తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఆ నేత.. చంద్రబాబు మార్క్
సుదీర్ఘ నేపథ్యం
దగ్గుబాటి పురందేశ్వరి ది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. భర్తతోపాటు ఆమె సైతం తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. 1995 టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబుతో( CM Chandrababu) కలిసి నిర్ణయం తీసుకున్నారు. అటు తరువాత చంద్రబాబుతో ఏర్పడిన విభేదాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్ పార్టీ సైతం గౌరవించింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు పురందేశ్వరి. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అయితే రాష్ట్ర విభజన తో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో పురందేశ్వరి బీజేపీ వైపు వెళ్లారు. 2014లో టిడిపి తో పొత్తులో భాగంగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో సైతం ఓటమి ఎదురైంది. అయితే 2023లో అనూహ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. టిడిపి తో పొత్తు కుదుర్చుకోవడంతో బిజెపికి ఓట్లు, సీట్లు పెరిగాయి. అయితే ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో కేంద్రమంత్రి పదవి కానీ.. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కానీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.