Homeఆంధ్రప్రదేశ్‌Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు ఇలా ఉంటాయా?!

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు ఇలా ఉంటాయా?!

Pulivendula Politics: రాష్ట్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకం. వైయస్ కుటుంబానికి పులివెందుల.. చంద్రబాబుకు కుప్పం.. ఇలా రాష్ట్రస్థాయిలో చాలా నియోజకవర్గాలు కొంతమంది నేతలకు ప్రత్యేకం. అయితే అవి కంచుకోటలుగా కార్యక్రమం లో తెరవెనుక చాలా రకాల కథనాలు ఉంటాయి. అటువంటి వాటిని రహస్యంగా ఉంచుకోవాల్సిన అవసరం నేతల పై ఉంది. అయితే పులివెందులలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవా వెనుక ఉన్న కథలు ఇప్పుడు బయటపడుతున్నాయి. వారి రాజకీయం కోసం వారి చేసే వికృత క్రీడలు అన్నీ ఇన్నీ కావని తెలుస్తోంది. పైకి మాత్రం పులులు, సింహాలు అంటూ ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. కానీ తెర వెనుక చాలా రకాల రాజకీయ కథనాలు ఉంటాయి. తాజాగా పులివెందుల విషయంలో అవినాష్ రెడ్డి వర్సెస్ బీటెక్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. మధ్యలో ఎమ్మెల్సీ భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆసక్తికర విషయాలు బయట పెట్టేసరికి.. పులివెందుల కథలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.

* జగన్ ప్రెస్ మీట్ తో కలకలం..
జగన్ తన ప్రెస్ మీట్ లో తన తాతను చంపిన వారిని కూడా విడిచిపెట్టిన గొప్ప మనసును బయటపెట్టారు. అప్పటి నుంచి రచ్చ రచ్చ జరుగుతూనే ఉంది. దీనిపై టిడిపి నేత బీటెక్ రవి ఘాటుగా స్పందించేసరికి ఎంపీ అవినాష్ రెడ్డి ఆయనను హెచ్చరించారు. వైయస్ కుటుంబం పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. ఇదే బిటెక్ రవి అమ్ముడు పోయే వ్యక్తిగా అభివర్ణించారు అవినాష్ రెడ్డి. ఢిల్లీలో విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చి.. వైసీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపారని.. అందుకు గాను 12 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని.. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదని.. అలాంటి నేత ఇప్పుడు కొనుగోలు చేసే శక్తికి చేరారు అంటూ బీటెక్ రవిపై నోరు పారేసుకున్నారు అవినాష్ రెడ్డి. అప్పటినుంచి రచ్చ రచ్చ అవుతోంది కడప జిల్లా రాజకీయాల్లో.

* బయట పెట్టేసిన బీటెక్ రవి..
అయితే వెంటనే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు బీటెక్ రవి. తాను పార్టీ మారి డబ్బులు డిమాండ్ చేస్తే వైసిపి హయాంలో ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కేసు వాపస్ చేసుకునేందుకు తనతో పాటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి బ్లాంక్ చెక్కులు ఇచ్చేందుకు సిద్ధపడలేదా అంటూ అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు బీటెక్ రవి. అదే వివేకానంద రెడ్డి పై తాను స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేయిస్తే.. ఎంపీటీసీలను తన శిబిరానికి పంపించలేదా అని గుర్తు చేశారు. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడితే.. 15 కోట్ల రూపాయల నగదు తో పాటు పదవి ఇస్తామని ఆఫర్ చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఓ తోట సాక్షిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి ఏకగ్రీవాలకు సహకరిస్తామని అవినాష్ రెడ్డి చెప్పలేదా అంటూ నిలదీసినంత పని చేశారు. మరోవైపు భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి అయితే ఏకంగా రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఓ జంట హత్యల కేసు అంశంతో ఒక సిట్టింగ్ జడ్జి తన ఉద్యోగాన్ని కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించారు. పులివెందుల అంటే చరిత్ర కలిగిన నియోజకవర్గం. వైయస్ కుటుంబాన్ని పులులు, సింహాలతో పోలుస్తుంటారు. కానీ ఆ నియోజకవర్గంలో వైయస్ కుటుంబం నడిపిన కథలు ఇప్పుడు బయటకు వస్తుండడంతో.. ఇప్పటివరకు గౌరవభావంతో చూసినవారు సైతం నిజమా అని ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసి కొన్ని.. తెలియనివి కొన్ని బయటపడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ అగ్రనాయకత్వంలో సైతం ఒక రకమైన సంచలనం అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version