Pulivendula Election Result: పులివెందులలో( pulivendula) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురయింది. ఆ పార్టీ చరిత్రలోనే ఇంతటి అపజయం ఎప్పుడూ ఎదురు కాలేదు. జడ్పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి హేమంత్ రెడ్డి పై 6035 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ తో పాటు ఇండిపెండెంట్ లకు వందలోపు ఓట్లు లభించడం విశేషం. ఎన్నెన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఇది షాకింగ్ పరిణామమే. దాదాపు 11 మంది అభ్యర్థులు పులివెందులలో పోటీపడ్డారు. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించడంతో.. సంబరాలు చేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ క్యాడర్. రాష్ట్రవ్యాప్తంగా పులివెందుల ఫలితం చర్చకు దారి తీసింది. హాట్ టాపిక్ అవుతోంది.
Also Read: తీవ్ర ఉత్కంఠ.. పులివెందులలో కౌంటింగ్ ప్రారంభం!
జెండా పాతిన టిడిపి
వైయస్సార్ కుటుంబానికి పెట్టని కోట పులివెందుల. అటువంటి చోట తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) జెండా పాతడం నిజంగా రికార్డ్. పులివెందులకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైయస్ కుటుంబ ప్రత్యర్ధులకు నేతలు దొరకని పరిస్థితి. అటువంటి చోట బలమైన అభ్యర్థిని నిలబెట్టడమే కాదు.. గెలిపించుకోవడం తెలుగుదేశం పార్టీకి సరికొత్త రికార్డు. అయితే ఈ విషయంలో బీటెక్ రవి అభినందనలు అందుకుంటున్నారు. ఆయన దూకుడు తోనే ఇది సాధ్యమైందని టిడిపి క్యాడర్ చెబుతోంది.
Also Read: ఏం జరిగినా సరే.. అంతా మీ మంచికే.. గుర్తుంచుకోండి..
ఐదు దశాబ్దాలుగా కంచుకోట
1978 నుంచి పులివెందుల నియోజకవర్గ వైయస్సార్ కుటుంబానికి( YSR family ) కంచుకోటగా మారిపోయింది. ప్రత్యర్థులకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టినా పులివెందుల నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి మాత్రం ఎవరి పాచిక పారలేదు. నందమూరి తారక రామారావు, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి హయాంలో సైతం పులివెందుల విషయంలో నెగ్గుకు రాలేకపోయారు. అటువంటిది 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేసరికి పులివెందులలో వైయస్సార్ కుటుంబ హవా తగ్గినట్లు అయింది. ఇప్పుడు ఏకంగా పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోవడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనలో పెట్టింది.