https://oktelugu.com/

Modi: సరైన టైంలో జగన్ కు దెబ్బేసిన మోదీ

రాజంపేట బిజెపి అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా పీలేరులో ఏర్పాటుచేసిన సభలోనే ప్రధాని పాల్గొన్నారు. వైసిపి ప్రభుత్వం పేదల వికాసం కోసం పనిచేయడం లేదని.. మాఫియా వికాసం కోసం పనిచేస్తుందని హాట్ కామెంట్స్ చేయడం వైసీపీ నేతలకు మింగుడు పడని విషయం.

Written By:
  • Dharma
  • , Updated On : May 9, 2024 / 08:38 AM IST

    Modi

    Follow us on

    Modi: ప్రధాని మోడీ వ్యాఖ్యలతో వైసిపి నేతలు బింబెలెత్తిపోతున్నారు. డైలమాలో పడ్డారు. ప్రధాని మోదీ వచ్చి వైసీపీ సర్కార్ తో పాటు మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ వైసీపీ నుంచి రియాక్షన్ లేదు. వారికి ఎలా స్పందించాలో తెలియడం లేదు. మరోసారి బిజెపి అధికారంలోకి రానుందన్న సంకేతాలు ఉన్నాయి. అందుకే నేతలు స్పందించేందుకు భయపడుతున్నారు. ప్రధాని మాటలను పక్కనపెట్టి.. చంద్రబాబు, పవన్ లపై మాత్రమే గురి పెడుతున్నారు. సరిగ్గా రాయలసీమ వెళ్లి ప్రధాని మోదీ జగన్ తో పాటు వైసీపీ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు. సహజంగా ఇటువంటి కామెంట్స్ వస్తే వైసిపి ఫైర్ బ్రాండ్స్ తెరపైకి వస్తారు. లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి అయినా తిప్పి కొడతారు. కానీ నిన్న ప్రధాని మోదీ హాట్ కామెంట్స్ చేసినా వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడం విశేషం. అయితే సహజంగానే ఈ వ్యాఖ్యలు టిడిపి, జనసేన శ్రేణులకు ఊపు తెచ్చాయి.

    రాజంపేట బిజెపి అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా పీలేరులో ఏర్పాటుచేసిన సభలోనే ప్రధాని పాల్గొన్నారు. వైసిపి ప్రభుత్వం పేదల వికాసం కోసం పనిచేయడం లేదని.. మాఫియా వికాసం కోసం పనిచేస్తుందని హాట్ కామెంట్స్ చేయడం వైసీపీ నేతలకు మింగుడు పడని విషయం. ఏపీలో కూటమి అధికారంలోకి రావాలని పదేపదే ప్రధాని మోదీ చెప్పడం కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికంగా రౌడీ రాజ్యం నడుస్తోందని ప్రధాని వ్యాఖ్యానించడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించేనని తెలుస్తోంది. గత నెలలో చిలకలూరిపేట సభకు హాజరైన ప్రధాని మోదీ.. ఎటువంటి రాజకీయ విమర్శలు చేయలేదు. దీంతో మా సీఎం జగన్ మంచివాడని.. అందుకే ప్రధాని మోదీ ఒక్క మాట కూడా అనలేకపోయారని వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకున్నాయి.

    అయితే గత కొద్దిరోజులుగా ఏపీ వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీ సీఎం జగన్ తో పాటు వైసీపీ సర్కార్ను ఏకిపారేస్తున్నారు. దీంతో వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అదును చూసి వైసిపిని ప్రధాని మోదీ దారుణంగా దెబ్బతీశారని.. టిడిపి కూటమికి ఊపు తెచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులపై బదిలీ వేటు పడింది. మరోవైపు ఎన్నికల నిర్వహణపరంగా కూటమికి సాయం అందం ఉందన్న సంకేతాలు ప్రధాని ఇచ్చారు. అయితే ప్రధాని నుంచి ఈ తరహా ఆరోపణలు వచ్చినా.. వైసీపీ శ్రేణులు మాత్రం ఇంతవరకు రియాక్ట్ కాకపోవడం.. వారిలో ఉన్న భయాన్ని తెలియజేస్తోంది.