https://oktelugu.com/

Prashant Kishor: జగన్ ను వెంటాడుతున్న ప్రశాంత్ కిషోర్

పోలింగ్ తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. ఎలక్షన్ కమిషన్, అధికార యంత్రాంగం పై నిట్టూర్పు మాటలతో ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానాలు చేయడంతో.. ఎక్కడో తేడా కొడుతుందన్న కామెంట్స్ వినిపించాయి.

Written By: , Updated On : May 20, 2024 / 10:47 AM IST
Prashant Kishor

Prashant Kishor

Follow us on

Prashant Kishor: గత ఎన్నికల్లో వైసిపి అంతులేని విజయానికి ప్రశాంత్ కిషోర్ ఒక కారణం. వైసీపీకి రాజకీయ వ్యూహ కర్తగా వ్యవహరించిన పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏపీలో చక్కగానే పనిచేశాయి. అంతకుముందున్న టిడిపి ప్రభుత్వం పై విషం చిమ్మడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ప్రజలను వర్గాలుగా విభజించి వైసిపి వైపు టర్న్ అయ్యేలా బాగానే పనిచేశారు.పోలింగ్ నాడే వైసిపి ఘనవిజయం సాధిస్తుందని ప్రకటించారు. ఏకంగా జగన్ కు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే అదే ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవుతుందని తేల్చి చెప్పారు. పదే పదే అదే మాట చెబుతూ వైసీపీ శ్రేణుల్లో కలవరానికి కారణమవుతున్నారు.

పోలింగ్ తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. ఎలక్షన్ కమిషన్, అధికార యంత్రాంగం పై నిట్టూర్పు మాటలతో ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానాలు చేయడంతో.. ఎక్కడో తేడా కొడుతుందన్న కామెంట్స్ వినిపించాయి. పోలింగ్ కు ముందే ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ వైసిపి ఓడిపోతుందని తేల్చి చెప్పారు. పోలింగ్ ముగిసిన రెండు రోజుల వరకు జగన్ సైతం మీడియా ముందుకు రాలేదు. కానీ విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి మరోసారి అధికారంలోకి రాబోతున్నామని ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ కు కౌంటర్ ఇచ్చినట్లు వ్యవహరించారు.కానీ ఒక పార్టీ అధినేతగాపార్టీ శ్రేణులతో సమావేశాలు కానీ, సమీక్షలు గానీ జరపలేదు. ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లి ప్రకటించడంపై సొంత పార్టీ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. కానీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేసేసరికి వైసీపీ శ్రేణుల్లోఒక రకమైన ధైర్యం వచ్చింది.కొంచెం ఊపిరి పీల్చుకున్నాయి.

అయితే జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ మరోసారి వైసీపీపై వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్కు దారుణ ఓటమి ఎదురుకానుందని తేల్చేశారు. జగన్ ధీమా వ్యక్తం చేయడంపై కూడా స్పందించారు. దేశంలో అందరూ గెలుస్తామని చెబుతారని.. గత రెండు ఎన్నికల్లో గెలుస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని.. 2014లో కూడా గెలుస్తానని జగన్ ప్రకటించారని.. లెక్కింపు నాడు నాలుగు రౌండ్లు పూర్తయినా.. పుంజుకుంటామని చెబుతారని.. ఎన్నికల్లో అది సహజ చర్యగా అభివర్ణించారు. ఏపీలో వైసిపి ఓటమి స్పష్టంగా కనిపిస్తోందని.. దానిని ఒప్పుకునే స్థితిలో జగన్ లేకపోవడం విచారకరమన్నారు. మొత్తానికైతే వైసీపీలో ఉన్న ఆ కొద్దిపాటి ఆశలను సైతం ప్రశాంత్ కిషోర్ చిదిమేస్తున్నారు. ఆ పార్టీ శ్రేణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.