Prashant Kishor: జగన్ ను గట్టిగానే తగులుకున్న ప్రశాంత్ కిషోర్

గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసిపి వ్యూహ కర్తగా పనిచేశారు. పార్టీ గెలుపులో కీలక భాగస్వామ్యం అయ్యారు. పోలింగ్ నాడే బంపర్ విక్టరీ తో గెలుస్తామని అదే జగన్తో ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు.

Written By: Dharma, Updated On : May 22, 2024 10:22 am

Prashant Kishor

Follow us on

Prashant Kishor: ఏపీ విషయంలో ప్రశాంత్ కిషోర్ గట్టి అభిప్రాయంతోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో జగన్ గెలవరని గట్టిగానే చెబుతున్నారు. జగన్ ది మేకపోతు గాంభీర్యంగా తేల్చేస్తున్నారు. జగన్ గెలుస్తానని చెబుతున్నారని.. గత రెండు ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇదే మాదిరిగా చెప్పుకొచ్చారని.. అంతెందుకు యూపీలో అఖిలేష్ యాదవ్ గెలుస్తానని చెప్పారని.. అందరూ గెలుపు కోసమే ప్రయత్నాలు చేస్తారని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు.అదే మాదిరిగా జగన్ చెబుతున్నారని.. కానీ ఏపీలో మాత్రం కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు.

గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసిపి వ్యూహ కర్తగా పనిచేశారు. పార్టీ గెలుపులో కీలక భాగస్వామ్యం అయ్యారు. పోలింగ్ నాడే బంపర్ విక్టరీ తో గెలుస్తామని అదే జగన్తో ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ జగన్ ఓడిపోతారని చెప్పడం విశేషం. అసలు గెలుపే లేదని.. 151 స్థానాలు ఎలా వస్తాయని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నిస్తున్నారు. జగన్ కు ఆ స్థానాలు వస్తే తన ముఖంపై పేడ వేయాలని.. జగన్ ఓడిపోతే ఆయన ముఖంపై పేడ వేయించుకోవాలని సవాల్ చేశారు.

ఢిల్లీ తో పాటు హైదరాబాదులో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దేశ రాజకీయాలతో పాటు ఏపీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. రవి ప్రకాష్ ఆర్ టి వి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో జగన్ ఓడిపోతున్నారని ప్రకటించారు. భారీ ఓటమి తప్పదని హెచ్చరించారు. అయితే పోలింగ్ తర్వాత జగన్ స్పందించలేదు. పూర్వాశ్రమంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో నడిచిన ఐ పాక్ కార్యాలయానికి వెళ్లి ఈ ఎన్నికల్లో గెలుస్తున్నామని ప్రకటించారు. కేవలం ప్రశాంత్ కిషోర్ కు కౌంటర్ ఇచ్చేందుకు.. ఐపాడ్ తో పీకేకు సంబంధం లేదని చెప్పే క్రమంలో జగన్ ఈ తరహా ప్రకటన చేశారని కామెంట్స్ నడిచాయి. అయితే దీనిపైనే తాజాగా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఏపీలో వైసీపీ గెలుపు పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.