Jani Master: అడ్డంగా బుక్కైన జానీ మాస్టర్.. సోషల్ మీడియాలో వైరల్

జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. చాలా సంవత్సరాలుగా పవన్ కు మద్దతు తెలుపుతూ వచ్చారు. ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో జానీ మాస్టర్ కు చోటు దక్కింది.

Written By: Dharma, Updated On : May 22, 2024 10:01 am

Jani Master

Follow us on

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బెంగళూరు రేవ్ పార్టీలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది. హీరో శ్రీకాంత్, నటిహేమ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే దీనిపై ఆ ముగ్గురు స్పందించారు. హేమ అయితే తాను హైదరాబాదులో ఉన్నట్లు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఓ ఫామ్ హౌస్ లో చిల్డ్ అవుతున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. మరోవైపు తనపై జరిగిన ప్రచారాన్ని హీరో శ్రీకాంత్ ఖండించారు. కొద్దిరోజుల కిందటే తన భార్య ఊహకు విడాకులు ఇస్తున్నట్లు ప్రచారం చేశారని.. ఇప్పుడు కూడా అదే తరహా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు జానీ మాస్టర్ తాను డాన్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉన్నట్లు ఒక వీడియో విడుదల చేశారు. కానీ వైసీపీ మాత్రం జానీ మాస్టర్ ను టార్గెట్ చేసుకుంది. ఆయన్ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఓ ఫోటో జత చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆలింగనం చేసుకున్నట్లు మరో ఫోటోను పోస్ట్ చేసింది. వీరి అసలు బాగోతం ఇది అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు ట్రోల్ అవుతోంది. దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది.

జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. చాలా సంవత్సరాలుగా పవన్ కు మద్దతు తెలుపుతూ వచ్చారు. ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో జానీ మాస్టర్ కు చోటు దక్కింది. పవన్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. వైసిపి తో పాటు జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో జానీ మాస్టర్ వైసీపీకి టార్గెట్ అయ్యారు. రెండు రోజుల కిందట బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. అక్కడ పోలీసులు దాడులు చేయడంతోటాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు తేలింది. అందులో జానీ మాస్టర్ఉన్నట్టు ప్రచారం జరగడంతో.. దానిని వైసీపీ ప్రచార అస్త్రంగా మార్చుకుంది. ఒకవైపు తాను లేనట్టు జానీ మాస్టర్ చెబుతున్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఆయన అదుపులోకి తీసుకున్నట్టు ఒక ఫోటో జత చేసింది. దీంతో ఇందులో నిజా నిజాలు ఏంటో తెలియాల్సి ఉంది. కానీ జనసేన అధినేత పవన్తో ఉన్న ఫోటోలు జత చేసి ప్రచారం చేయడంపై జనసైనికులు మండిపడుతున్నారు.