Homeఆంధ్రప్రదేశ్‌Prakash Raj: ప్రకాష్ రాజ్ చుట్టూ బిజెపి ఉచ్చు!

Prakash Raj: ప్రకాష్ రాజ్ చుట్టూ బిజెపి ఉచ్చు!

Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజు పై హిందూ సమాజం ఆగ్రహం గానే ఉంది. ఆయన అనవసర వివాదాస్పద అంశాల జోలికి వెళ్లి తన మీదకు తెచ్చుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన కర్ణాటక ధర్మస్థల పై అంతర్జాతీయ కుట్రలో ఆయన భాగస్తుడు అని ఆరోపణలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఏకంగా తిరుపతిలో ఆయనపై కోర్టులో ఒక దావా వేయడం విశేషం. దీంతో ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసు నమోదయింది. రాముడితో పాటు లక్ష్మణుడిని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ అత్యంత హేయమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి సీనియర్ నేత, టిటిడి పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తిరుపతిలోని 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు. ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగానే మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆయన న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్ లో పేర్కొన్నారు.

* రామలక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు..
కేరళలో లిటరేచర్ ఫెస్టివల్ కు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. ఆ సమయంలో హిందూ ధర్మంపై హాట్ కామెంట్స్ చేశారు. రామలక్ష్మణులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాదికి వచ్చిన వలస కూలీలుగా పేర్కొన్నారు. రావణుడి తోటలో పండ్లను దొంగిలించారు అంటూ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. గతంలోనే ప్రకాష్ రాజుకు లీగల్ నోటీసులు పంపించారు లాయర్ ద్వారా బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి. కానీ అందుకు ప్రకాష్ రాజ్ ముందుకు రాలేదు. క్షమాపణలు చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకే భాను ప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజ్ పై చట్టపరమైన పోరాటం ప్రారంభించారు. తిరుపతి కోర్టులో క్రిమినల్ దావా దాఖలు చేశారు. హిందూ దేవుళ్ళతోపాటు సంప్రదాయాలపై సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజు చేసే కామెంట్స్ ను కూడా గుర్తు చేశారు భాను ప్రకాష్ రెడ్డి.

* చిత్ర పరిశ్రమకు ఫిర్యాదు..
కేవలం చట్టపరంగానే కాదు ప్రకాష్ రాజ్ పై భాను ప్రకాశ్ రెడ్డి చిత్ర పరిశ్రమకు సంబంధించిన అసోసియేషన్స్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. హిందూ సమాజం ఇస్తున్న ఆదరణతోనే నటుడిగా ప్రకాష్ రాజు కోట్లు సంపాదిస్తున్నారని.. తిరిగి అదే సమాజాన్ని అవమానించేలా మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం మా తో పాటు.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్స్ కు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు కూడా భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై ప్రకాష్ రాజు వరుసగా విమర్శలు చేస్తూ వచ్చారు. పవన్ రాజకీయ విధానాలపై కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి వ్యతిరేక కామెంట్స్ చేస్తుంటారు ప్రకాష్ రాజ్. అయితే బిజెపి ఫిర్యాదుతో ఆయన వెనక్కి తగ్గుతారా? లేదా? అన్నది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular