Posani Krishna Murali
Posani Krishna Murali : పోసాని కృష్ణమురళికి ( Posani Krishna Murali )బెయిల్ లభించింది. కానీ ఆ ఆనందం ఆయనకు ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రతి సోమవారం తో పాటు గురువారం సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయాల్సి ఉంది. సిఐడి కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడే ఈ షరతు పెట్టింది. దీంతో పోసాని కృష్ణ మురళికి బెయిల్ అయితే లభించింది కానీ.. కేసుల నుంచి విముక్తి కలిగేలా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. గత నెల 26న ఆయన అరెస్ట్ అయ్యారు. కేసుల మీద కేసులు నమోదయ్యాయి. కస్టడీల మీద కస్టడీలు కొనసాగాయి. చివరకు 24 రోజుల అనంతరం ఆయన జైలు నుంచి విముక్తి పొందారు.
Also Read : జైలు నుంచి విడుదల కాగానే అంబటిని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయిన పోసాని
* 24 రోజులుగా రిమాండ్..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణ మురళి. ఫోటో మార్ఫింగ్ చేసి సైతం ఆయన కామెంట్స్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. తొలుత ప్రకాశం జిల్లా పోలీసులు గత నెల 26న హైదరాబాదులో కృష్ణ మురళిని అదుపులోకి తీసుకున్నారు. అది మొదలు ఆయనపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లా జైలులకు తరలిస్తూ ఆయన కస్టడీ 24 రోజులు పాటు కొనసాగింది. కొద్ది రోజుల కిందట అన్ని కేసులలో ఆయనకు బెయిల్ లభించింది. కానీ ఇంతలో సిఐడి పీటి వారెంట్ ఇచ్చింది. దీంతో పోసానిని కర్నూలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే న్యాయస్థానంలోనే తనకు ఆరోగ్యం బాగా లేదంటూ పోసాని కృష్ణ మురళి కన్నీటి పర్యాంతం అయ్యారు. అయినా సరే అప్పట్లో న్యాయస్థానం ఆయన రిమాండ్ ను కొనసాగించింది.
* షరతులతో కూడిన బెయిల్..
ఈ నెల 21న పోసాని కృష్ణ మురళి సిఐడి కోర్టులో( CID Court ) బెయిల్ పిటిషన్ వేశారు. మద్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రెండు లక్షల పూచికత్తుతో ఆయనకు బెయిల్ ఇచ్చింది కోర్టు. ప్రతి సోమ, గురువారాల్లో సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మీడియాతో కేసుల గురించి అస్సలు మాట్లాడకూడదు అని సూచించింది. అదే సమయంలో పోసాని కృష్ణ మురళికి సిఐడి విచారణకు సహకరించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోసాని కృష్ణ మురళికి ఉపశమనం దక్కలేదని తేలిపోయింది. తదుపరి కొనసాగింపు కూడా ఉంటుందని స్పష్టమైంది.
* ఉన్నట్టుండి ప్రకటన..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన వెంటనే పోసాని కృష్ణ మురళి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాస్త యాక్టివ్ గానే కనిపించారు. అయితే ఉన్నట్టుండి ఆయన ఓ రోజు కీలక ప్రకటన చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చేశారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పుకొచ్చారు. అయితే గతంలో పోసాని కృష్ణ మురళి చేసిన కామెంట్స్ ను టిడిపి, జనసైనికులు మరిచిపోలేదు. అందుకే పాత కేసులు తెరపైకి వచ్చాయి. పోసాని అరెస్టు జరిగింది. ఆయనకు బెయిల్ లభించింది. అయితే అది మనశ్శాంతి లేని బెయిల్ అని తేలిపోయింది. సో మున్ముందు పోసాని వ్యవహార శైలి బట్టి కేసుల తీవ్రత ఉంటుందని విశ్లేషకులు సైతం తేల్చి చెబుతున్నారు.
Also Read : స్కూటర్ మీద ఎమ్మెల్యే.. ఆయన మారడంతే!