Kotamreddy Sridhar Reddy
Kotamreddy Sridhar Reddy: సాధారణంగా ఎమ్మెల్యే( MLA) వస్తే ఆ హడావిడి వేరు. వాహనాల కాన్వాయ్.. వెంట అనుచరులు వాహనాలతో ఫాలో కావడం చూస్తుంటాం. ఇక అభివృద్ధి పనుల శంకుస్థాపన సమయంలో అయితే వారు చేసే సందడి అంతా ఇంతా కాదు. అంతలా మారిపోయింది ఏపీలో రాజకీయ వ్యవస్థ. ఇక ఫ్లెక్సీలు, ఆహ్వాన ఏర్పాట్లు ఓ తరహాలో ఉంటాయి. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం దీనికి విరుద్ధం. హంగామాకు ఇష్టపడరు. దర్పానికి దూరంగా ఉంటారు. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రజలతో మమేకమై పనిచేయడానికి ఇష్టపడతారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో వరుసగా గెలుపొందడానికి అదే కారణం.
Also Read: తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. కలెక్టర్ల సదస్సులో సీఎం సంచలన ప్రకటన!
* వైసీపీలో క్రియాశీలకంగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో పని చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( Kottam Reddy Sridhar Reddy). జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయత నేత కూడా. అటువంటి కోటంరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి చెందారు. ఆ పార్టీకి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆయన పార్టీ మారవచ్చు కానీ.. ప్రజలతో మమేకమయ్యే విధానం మాత్రం ఒకేలా ఉంటుంది. తాజాగా చిన్నపాటి ద్విచక్ర వాహనంపై ఆయన చేసిన పర్యటన వైరల్ అయింది. అభివృద్ధి పనుల పర్యవేక్షణకు గాను ఆయన స్కూటర్ పై వెళ్లడం ఆకట్టుకుంది.
* రికార్డు స్థాయిలో శంకుస్థాపనలు..
నెల్లూరు రూరల్( Nellore rural ) నియోజకవర్గ పరిధిలో మార్చి 9న ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మిగతా పనులకు ఆ తర్వాత కూడా శంకుస్థాపనలు కొనసాగించారు. దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపడుతున్నారు. అయితే శంకుస్థాపన సమయంలోనే 60 రోజుల్లో ఈ పనులు పూర్తి చేయిస్తానని కాటంరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. మే 20 నాటికి ప్రజలకు అంకితం చేస్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఆకస్మిక పర్యటనకు బయలుదేరారు కోటంరెడ్డి. మామూలుగా నేతలతో కలిసి వెళ్తే పనులు పరిశీలించలేమని భావించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. హెల్మెట్ ధరించి, స్కూటర్ పై తిరుగుతూ అభివృద్ధి పనులు పరిశీలించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* పార్టీ అధినేత పట్ల విధేయత..
ఏ పార్టీలో ఉన్న.. పార్టీకి విధేయత గా ఉండడం, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవడం కోటంరెడ్డికి అలవాటైన విద్య. అందుకే ఇప్పుడు ప్రభుత్వంతో పనులు చేయించేందుకు ఎంతగానో ప్రాధాన్యమిస్తున్నారు. వాస్తవానికి కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ సమీకరణల్లో భాగంగా ఆయనకు చాన్స్ దక్కలేదు. అయినా సరే నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారు కోటంరెడ్డి. తనకు తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రజల్లో బలమైన నాయకుడిగా మారుతున్నారు.