spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Poll survey in AP : ఏపీలో వైసీపీకి జైకొట్టిన పోల్ స్ట్రాటజీ సర్వే

Poll survey in AP : ఏపీలో వైసీపీకి జైకొట్టిన పోల్ స్ట్రాటజీ సర్వే

Poll survey in AP : ఏపీలో మరో సంచలన సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో వైసీపీ తిరుగులేని ఆధిక్యతలో ముందంజలో ఉంది. ఎవరెన్ని కూటములు కట్టినా ప్రజలు మాత్రం జగన్ పక్షమే అని స్పష్టమైంది. ఇటీవల నేషనల్ మీడియా సంస్థ టౌైమ్స్ నౌ భారత్ సర్వేలో వైసీపీది ఏకపక్ష విజయం అని తేల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా సర్వేలో సైతం అదే తేలింది. జగన్ ను నిలువరించడం కష్టమేనని ఈ సర్వే ఫలితం వెల్లడించింది. పోల్ స్ట్రాటజీ అనే సంస్థ ఏపీ వ్యాప్తంగా సర్వే చేసింది. టీడీపీ, జనసేన కూటమి కట్టినా వైసీపీదే గెలుపు అని స్పష్టంగా చెప్పింది.

కేవలం ఓటు షేరింగ్, నాయకత్వ పటిమపై మాత్రమే ఈ సర్వే సాగింది. వైసీపీ ఏకంగా 49 శాతం ఓటు షేరింగ్ తో ముందంజలో ఉంది. టీడీపీ, జనసేన కూటమికి 41 శాతం ఓటింగ్ శాతం దక్కుతుందని తేల్చేసింది. మరో పది శాతం ఇతరులకు వెళుతందని తేల్చింది.  సీఎంగా ఎవరు సమర్థులు అన్న ప్రశ్నకు 56 శాతం మంది జగన్ కు ఓటేయగా , చంద్రబాబుకు 37 శాతం మంది జైకొట్టారు. పవన్‌ను కేవలం 7 శాతం మంది మాత్రమే ఎంచుకున్నారు. జగన్ సర్కారు పాలన బాగుందని 56 శాతం మంది చెప్పగా… 22 శాతం మంది బాలేదన్నారు. 9 శాతం మంది చాలా బాగుందని చెప్పగా.. 8 శాతం మంది అసలు బాలేదన్నారు. మూడు శాతం మంది మాత్రం ఎటూ చెప్పలేక న్యూట్రల్ గా ఉండిపోయారు.

2019 ఎన్నికలతో పోల్చుకుంటే వైసీపీకి ఓటు షేరింగ్ కూడా పెరుగుతందని సర్వే తేల్చేసింది. కేవలం సంక్షేమ పథకాల అమలుతోనే జగన్ వైపు ప్రజలు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అభివృద్ధి లేదన్న అపవాదు కంటే ప్రజలు సంక్షేమానికి ఓటు వేశారు.  చంద్రబాబు సైతం మినీ మేనిఫెస్టోతో పథకాలను ప్రకటించినా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదని తేలింది. సంక్షేమం అమలు విషయంలో చంద్రబాబు గతంలో పేలవ ప్రదర్శన కూడా జగన్ కు కలిసి వచ్చింది. గతంలో చంద్రబాబు డ్వాక్రా, రైతు రుణమాఫీ హామీ ఇచ్చి అమలుచేయలేకపోయారు. ఇదికూడా ప్రతికూలాంశంగా మారింది. జగన్ మాత్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నాపథకాలు అమలుచేసి చూపడం కూడా ప్రజలను ఆకర్షించింది.

టీడీపీ, జనసేన పొత్తు కూడా పెద్దగా వర్కవుట్ కాదని సర్వే తేల్చింది. పొత్తులు ప్రకటనలకే పరిమయితమవుతున్నాయి. దానికి ఒక భావసారుప్యత రావడం లేదు. అటు పవన్ దూకుడు ఎటువంటి ఫలితాన్నిస్తుందోనన్న భయం చంద్రబాబును వెంటాడుతోంది. పొత్తుతో వెళితే సీట్లు తగ్గిపోతాయి.. లేకుంటే ఓటమి తప్పదన్న ఆందోళనలో బాబు ఉన్నారు. అటు బీజేపీతో వెళితే ఏపీ ప్రజల ఆగ్రహం కూటమిపై పడే చాన్స్ కనిపిస్తోంది. ఇన్ని ప్రతికూలతల మధ్య చంద్రబాబు ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో పోల్ స్ట్రాటజీ సంస్థ సర్వే వెల్లడించిన అంశాలతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన ప్రారంభమైంది. నేతలు మాత్రం అదో ఫేక్ సర్వేగా తేల్చుతున్నారు. వైసీపీ శ్రేణులు మాత్రం సర్వే ఫలితాలతో ఖుషీ అయ్యింది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version