Voters List : ఓటర్ల జాబితా అక్రమాలకు కళ్లెం వేస్తారా? సరిపెట్టుకుంటారా?

ఆధార్ అనుసంధానం తరువాత కూడా ఇంతలా భారీ అక్రమాలు ఏమిటని ఎలక్షన్ కమిషన్ నివ్వెరపోయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిని నిలదీసినంత పనిచేసింది. ఢిల్లీ పిలిచి మరీ తలంటింది. అయితే ఏపీ సీఈవో ఏం చేస్తారన్నది ఇప్పడు ఆసక్తిగా మారింది. ఎన్నికల జాబితాను సరిచేస్తారా? లేకుంటే రాజకీయ ఒత్తిళ్లతో ఉత్త చర్యలకు పరిమితం అవుతారా అన్నది చూడాల్సి ఉంది. 

Written By: Dharma, Updated On : July 13, 2023 5:10 pm
Follow us on

Voters List : పౌరులకు రాజ్యాంగం కల్పించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. దీనిని సరైన పద్ధతిలో వినియోగించుకుంటే  శ్రీరామరక్షలా ప్రజలను కాపాడుతుంది. అలా కాకుండా ఓటును నోటు కోసమే.. మందుకోసమే.. ఇతర ప్రలోభాలకు లోబడి ఉపయోగించుకుంటే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే ఎవరి ఓటుతో అధికారంలోకి వచ్చామే.. వారి హక్కులను అడ్డగోలుగా నరికివేస్తే..వారి ఓటుహక్కును తొలగిస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజాస్వామ్యమే. శాశ్వత అధికార కాంక్షతో అలా వ్యవహరించిన వారు కాలగర్భంలో కలిసిపోయినట్టు చరిత్ర చెబుతోంది. కానీ ఏపీ పాలకులకు మాత్రం అది తెలియకపోవడం గమనార్హం.

జరిగినంత కాలం జంగిడితో నీరు మోయవచ్చన్నది సామెత. కానీ ఏపీలో ఆ విషయం పాలకులకు అర్ధమైంది. ఇటీవల ఓటరు జాబితాలను పరిశీలిస్తుంటే నివ్వెరపోయిన నిజాలు బయటకు వచ్చాయి. తమకు ఓటు వేయరనుకున్న వర్గాలు, సమూలహాల ఓట్లు తొలగించడం, కొత్తగా బోగస్ ఓట్లను చేర్పించిన విషయం వెలుగుచూసింది. దీని వెనుక పాత్రధారులు, సూత్రధారులు బయటపడ్డారు. దేశమంతా నివ్వెరపోయింది. చివరకు ఎన్నికల అధికారులు సైతం తప్పు జరిగిందని ఒప్పుకునే స్థితికి వచ్చారు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.

దేశంలోని అన్ని కార్యకలాపాలకు ఆధార్ ను అనుసంధానిస్తున్నప్పుడు ఓటరు కార్డుకు ఎందుకు వర్తింపజేయడం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై అధికారంలో ఉన్న పార్టీలు పెద్దగా ఫోకస్ పెట్టవు. ఎందుకంటే అక్కడ ఎంత తిరకాసు ఉండాలో అంతలా ఉంటుంది.ఇలాంటి పరిస్థితుల్లోఉన్నట్లుండి కేంద్ర మంత్రివర్గం ఆధార్ తో ఓటుకార్డును అనుసంధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. దీంతో ఏపీలో స్పెషల్ డ్రైవ్ జరిగింది. ఒకే అడ్రస్ తో వేలు, వందల ఓట్లు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. అవన్నీ మీ హయాంలో అంటే మీహయాంలో అని అధికార, విపక్షాలు కీచులాడుకున్నాయి.

ఏపీలో ఈ ఓట్ల అక్రమాల్లో పెద్దల పాత్ర స్పష్టంగా బయటపడింది. ఆధార్ అనుసంధానం తరువాత కూడా ఇంతలా భారీ అక్రమాలు ఏమిటని ఎలక్షన్ కమిషన్ నివ్వెరపోయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిని నిలదీసినంత పనిచేసింది. ఢిల్లీ పిలిచి మరీ తలంటింది. అయితే ఏపీ సీఈవో ఏం చేస్తారన్నది ఇప్పడు ఆసక్తిగా మారింది. ఎన్నికల జాబితాను సరిచేస్తారా? లేకుంటే రాజకీయ ఒత్తిళ్లతో ఉత్త చర్యలకు పరిమితం అవుతారా అన్నది చూడాల్సి ఉంది.