Homeఆంధ్రప్రదేశ్‌Political Panchangam In Andhra Pradesh: పొలిటికల్ పంచాంగాలు.. ఎవరి డప్పు వారిదే

Political Panchangam In Andhra Pradesh: పొలిటికల్ పంచాంగాలు.. ఎవరి డప్పు వారిదే

Political Panchangam In Andhra Pradesh: ఉగాది పంచాంగ శ్రవణం అంటే ఎంతో ప్రత్యేకమైనది. ఏడాదిలో జరిగే మంచి చెడులను చెబుతుంది. ఎన్నో శుభాలను తీసుకొస్తుంది. అయితే దురదృష్టం కొద్దీ ఈ పంచాంగానికి సైతం రాజకీయ మరక అంటుకుంది. గత కొంతకాలంగా పంచాంగం అనగానే.. అది ఏ పంచాంగం? టిడిపి పంచాంగమా? లేకుంటే వైసిపి పంచాంగమా? ఇంకో పార్టీ పంచాంగమా? అని అడిగే పరిస్థితికి వచ్చింది. జ్యోతిష్యం పరమ పవిత్రం. దానిని నువ్వు శాస్త్రంగా చెబుతారు. కానీ ఇప్పుడు అది రాజకీయం అయిపోయింది. పార్టీలకు అనుకూలంగా జాతకాలు మారిపోతున్నాయి. టిడిపి కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరిగితే అందుకు తగ్గట్టు పంచాంగం రాసుకున్నారు పండితులు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోలా పంచాంగం రాస్తున్నారు. అయితే వీరిని పండితులు అనాలో.. రాజకీయ పండితులు అనాలో తెలియడం లేదు.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్ షోస్ రివ్యూ…మామూలు రచ్చ కాదుగా..?

* ఒకేలా ఉంటేనే విలువ..
ఏ పార్టీ కార్యాలయంలో జరిగినా.. ఇతర చోట్ల జరిగినా పంచాంగ శ్రవణం ఒకేలా ఉంటే దానికి విలువ. పంచాంగాన్ని చదివే పండితుడికీ ఒక విలువ ఉంటుంది. ఫలానా రాజకీయ పార్టీకి పరిస్థితులు అనుకూలం అని ఒకరు.. ఇక తిరుగులేదు రాజయోగమే అంటూ మరొకరు.. ఇలా ఎవరికి వారు రాజకీయ పంచాంగాలు చెబుతున్నారు. రాజకీయ పంచాంగాలు కాదు ఉగాదినాడు.. నాయకులను ఉద్దేశించి పెద్ద పెద్ద పద్యాలు పాడుతున్న పండితులు ఉన్నారు. అయితే ఈ రాజకీయ పంచాంగ శ్రవణం పుణ్యమా అని.. నిజమైన పాండిత్యంతో చెప్పే పంచాంగాలకు సైతం నమ్మే పరిస్థితి లేదు.

* నమ్మని ప్రజలు..
రాజకీయ పంచాంగాల విషయంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. వాటిని నమ్మేస్థితిలో కూడా లేరు. హిందూ సమాజం కూడా ఈ రాజకీయ పంచాంగాల పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది. బహుశా ఈ సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు. అందుకే ఈ పరాభవ నామ సంవత్సరంలో రాజకీయ పంచాంగాలు సాధారణంగా ఉంటాయని అనిపిస్తోంది. అయితే గత కొంతకాలంగా పొలిటికల్ పంచాంగ శ్రవణాలను వినడమే మానేశారు ప్రజలు. కానీ ఎవరి డప్పు వారు కొట్టండి రా అన్నట్టు సొంత పార్టీ శ్రేణులను ఆకట్టుకునేందుకే ఈ పొలిటికల్ పంచాంగ శ్రవణాలు కొనసాగుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version